Share News

టీబీజీకేఎస్‌తో బీఆర్‌ఎస్‌కు సంబంధం లేదు

ABN , Publish Date - May 16 , 2024 | 12:31 AM

సింగరేణి ట్రేడ్‌యూనియన్‌ టీబీజీకేఎస్‌ కమిటీకి బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కార్మికులు, ప్రజలు గుర్తించాల ని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు.

టీబీజీకేఎస్‌తో బీఆర్‌ఎస్‌కు సంబంధం లేదు

రామగిరి, మే 15: సింగరేణి ట్రేడ్‌యూనియన్‌ టీబీజీకేఎస్‌ కమిటీకి బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కార్మికులు, ప్రజలు గుర్తించాల ని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు. బుధవారం స్థానికంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడారు. గతంలో యూనియన్‌ నేతల అవినీతి అక్రమాల పుణ్యాన గోలేటి నుంచి సత్తు పల్లి వరకు ఓటమిపాలైందని ఆరోపించారు. టీబీ జీకేఎస్‌ అధ్యక్ష,కార్యదర్శుల విషయంలో భవిష్యత్‌ లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు పున రావృతం కాకుండా ముందుస్తుగా కార్మిక వర్గానికి సమాచారం ఇస్తున్నట్లు తెలిపారు. సింగరేణిలో టీబీజీకేఎస్‌ యూనియన్‌ నేతలు సాధారణ ఎన్ని కలు వచ్చాయంటే అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉంటారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ముసుగులో మీ వద్దకు వచ్చినట్లయితే నమ్మవద్దని దాని ప్రభావం బీఆర్‌ఎస్‌ పార్టీకి అంటగట్టవద్దని కార్మి కులు, ప్రజలను కోరారు. సాధారణ ఎన్నికల్లో కార్మికులు బీఆర్‌ఎస్‌ పార్టీకి దూరం అవడానికి సెంటినరీకాలనికి చెందిన యూనియన్‌ నాయ కులే ప్రధాన కారణంగా చెప్పారు. వారి అవినీ తికి బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎలాంటి సంబంధం ఉండ దని పేర్కోన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు శంకేషి రవీందర్‌, మార్కేట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పూదరి సత్యనారయణగౌడ్‌, నాయ కులు జక్కు రాకేష్‌, మ్యాదరవేని కుమార్‌ యా దవ్‌, శ్రీశైలం, దర్ముల సంపత్‌, ప్రశాంత్‌, తది తరులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2024 | 12:31 AM