Share News

కార్మికులపై బీఆర్‌ఎస్‌ మొసలి కన్నీరు

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:19 AM

సింగరేణి కార్మికులపై బీఆర్‌ఎస్‌ మొసలి కన్నీరు కారుస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ ఆరోపించారు.

కార్మికులపై బీఆర్‌ఎస్‌ మొసలి కన్నీరు

గోదావరిఖని, ఏప్రిల్‌ 18: సింగరేణి కార్మికులపై బీఆర్‌ఎస్‌ మొసలి కన్నీరు కారుస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ ఆరోపించారు. గురువారం ఆర్‌జీ-1 పరిధిలోని జీడీకే 11ఇంక్లైన్‌పై కాం గ్రెస్‌ పెద్దపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సంవత్సరా లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఏ రోజు కూడా కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని, అప్పుడు కార్మికుల కష్టాలు కనబడలేదా అని ప్రశ్నించా రు. కార్మిక నాయకునిగా అనుభవం ఉన్న కొప్పుల ఈశ్వర్‌ ఏ రోజైనా కా ర్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారా అని, ఇప్పుడు ఏ ము ఖం పెట్టుకుని ఓట్లు అడగటానికి వస్తున్నాడని ప్రశ్నించారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో కార్మికులు, ప్రజలు, కార్మికులు చరమగీతం పాడ నున్నారని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సింగరేణి డిపెండెంట్‌ ఉద్యోగాల వయోపరిమితి 35సంవత్సరాల నుంచి 40సంవత్స రాలకు వెసులుబాటు కల్పించడం జరిగిందని, త్వరలోనే సింగరేణి ఆధ్వ ర్యంలో 800మెగవాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నారని, కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి వచ్చిన లాభాల్లో రామగుం డంలో రూ.500కోట్లతో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిం దని, దీనికి సింగరేణి మెడికల్‌ కాలేజీగా నామకరణం చేయడం జరిగిం దన్నారు. ఎన్నికలు అయిపోయిన తరువాత కార్మికుల సమస్యలు పరిష్క రించే దిశగా కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్ల మెంట్‌ అభ్యర్థి గడ్డం వంశీ, మేయర్‌ బంగి అనీల్‌కుమార్‌, ఐఎన్‌టీయూ సీ నాయకులు జనక్‌ ప్రసాద్‌, కాల్వ లింగస్వామి, కార్పొరేటర్లు బొంతల రాజేష్‌, మహంకాళి స్వామి, ఎండీ ముస్తాఫా, కాంగ్రెస్‌ నాయకులు పెద్దె ల్లి ప్రకాష్‌, తిప్పారపు శ్రీనివాస్‌, గట్ల రమేష్‌, పెంచాల తిరుపతి, గడ్డం కృష్ణ, పుట్ట రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:19 AM