Share News

బీజేపీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి

ABN , Publish Date - Sep 08 , 2024 | 11:43 PM

బీజేపీ సభ్యత్వ నమోదు లక్ష్యాన్నిప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని జిల్లా సభ్యత్వ నమోదు ప్రభారి ఆరుముళ్ల పోషం, జిల్లా ప్రముఖ్‌ క్యాతం వెంకటరమణ పిలుపునిచ్చారు.

బీజేపీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి

కళ్యాణ్‌నగర్‌, సెప్టెంబరు 8: బీజేపీ సభ్యత్వ నమోదు లక్ష్యాన్నిప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని జిల్లా సభ్యత్వ నమోదు ప్రభారి ఆరుముళ్ల పోషం, జిల్లా ప్రముఖ్‌ క్యాతం వెంకటరమణ పిలుపునిచ్చారు. ఆదివారం మార్కండేయకాలనీలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా కో ఆర్డినేటర్లు, శక్తి కేంద్రాలు, బూత్‌ల వారిగా ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాకు 1.35లక్షల సభ్యత్వ లక్ష్యాన్ని నిర్దేశించిందని, అట్టి లక్ష్యాన్ని పూర్తి చేయాలని, ఈనెల 10న జిల్లా కేంద్రంలో అమర్‌చందర్‌ కళ్యాణమండపంలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం కానున్నదని, 11వ తేది నుంచి మండల కేంద్రాలు, మండల పార్టీ అధ్యక్షులు సభ్యత్వ నమోదునుచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌, జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్‌రెడ్డి సభ్యత్వాన్ని స్వీకరించనున్నారని తెలిపారు. ఈ సమావేశంలో పోలుసాని సంపత్‌రావు, జక్కుల నరహరి, రాజం, కృష్ణ, రాజేష్‌నాయక్‌, సంతోష్‌, శ్రావణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2024 | 11:43 PM