Share News

బీజేపీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి

ABN , Publish Date - Jun 24 , 2024 | 12:48 AM

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాలు, దేశంలో ఎక్కడ అమలు జరగడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించే ముందు బీజేపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.

బీజేపీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి
రేచపల్లిలో కాలువను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

- సన్న రకం సాగుచేసే రైతులకు రూ. 500 బోనస్‌

- ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

సారంగాపూర్‌, జూన్‌ 23: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాలు, దేశంలో ఎక్కడ అమలు జరగడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించే ముందు బీజేపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని రేచపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సంధర్బంగా గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులను పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వంలో కేసీఆర్‌ సన్నరకం సాగు చేయమని ఆంక్షలు విధించి ఏ రకమైన బోనస్‌ ఇవ్వకుండా రైతులను మోసం చేశాడని గుర్తు చేశాడు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ విధమైన ఆంక్షలు లేకుండా సన్న రకం సాగు చేసే రైతులకు క్వింటాల్‌కు 500 రూపాయలు బోనస్‌ ఇచ్చి రైతులను ఆదకుంటామని తెలిపారు. నిరుపేదలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్న రకం సాగును రూ. 500 బోనస్‌ కల్పించి ప్రోత్సహిస్తుందన్నారు. రైతులపై ఆర్థిక భారం పడకుండా పంటల బీమా పథకానికి 50 శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ప్రీమియం చెల్లిస్తుందని అన్నారు. గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేయలేదని ఇంకా నాలుగువేల కోట్లు బకాయిలు చెల్లింపు చేయలేదన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం రెండు పర్యాయాలు కలిపి రూ 28వేల కోట్లు అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండు లక్షలు ఏక మొత్తంలో రూ 31వేల కోట్లతో రుణమాఫీ చేస్తోందన్నారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలో 100 శాతం తాగు నీరందించామని కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేధిక సమర్పించడంతో రాష్ట్రానికి రావల్సిన నిధులు పొందలేక పోతున్నామన్నారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో భగీరథ నీరు ఏ మేరకు అందుతుందో పూర్తిస్థాయిలో సర్వే చేయిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో రేచపల్లిలో నీటి కొరత ఉత్పన్నం కాకుండా గ్రామంలో మంచి నీటి బావికి ప్రభుత్వం ద్వారా మంజూరైన నిధులతో గాజుల నిర్మాణం చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ప్రసాద్‌ గౌడ్‌, తిరుపతిరెడ్డి, ఆకుల రాజిరెడ్డి, ఇబ్రాహీం, లక్ష్మారెడ్డి, హరీష్‌, ఆకుల రాజిరెడ్డి, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2024 | 12:49 AM