Share News

నేతన్నలను పట్టించుకోని బీజేపీ, బీఆర్‌ఎస్‌

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:16 AM

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పదేండ్లు పరిపాలించినా పవర్‌లూం నేత కార్మికులు, పద్మశాలి సమాజాన్ని పట్టించుకోలేదని, రెండు పార్టీలు శవ రాజకీయాలు చేస్తున్నాయని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపదాస్‌ మున్షీ అన్నారు.

నేతన్నలను పట్టించుకోని బీజేపీ, బీఆర్‌ఎస్‌
తంగళ్లపల్లిలో కార్మిక కుటుంబాన్ని పరామర్శిస్తున్న దీపదాస్‌ మున్షీ

సిరిసిల్ల, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పదేండ్లు పరిపాలించినా పవర్‌లూం నేత కార్మికులు, పద్మశాలి సమాజాన్ని పట్టించుకోలేదని, రెండు పార్టీలు శవ రాజకీయాలు చేస్తున్నాయని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపదాస్‌ మున్షీ అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డ వార్ఫిన్‌ కార్మికుడు అడిచెర్ల సాయి, తంగళ్లపల్లిలో అంకారపు మల్లేశం కుటుంబాలను, కాంగ్రెస్‌ బృందం పరామర్శించింది. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్‌, సిరిసిల్లకు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌ సిరిసిల్ల నేత కార్మికులు, పద్మశాలి సమాజానికి ఏమీ చేయలేదని అన్నారు. బీజేపీ వస్త్ర పరిశ్రమకు 12 శాతం జీఎస్టీ వేసిందని అన్నారు. 26 వేల మరమగ్గాలపై పేద నేత కుటుంబాలు అధారపడి జీవిస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వ అర్డర్లకు సంబంధించి రూ.275 కోట్ల బకాయిల బిల్లులు చెల్లించలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని చెల్లించే ప్రయత్నం చేస్తుందని అన్నారు.ఎలక్షన్‌ కోడ్‌ ముగిసిన తరువాత కాంగ్రెస్‌ ప్రభుత్వం పవర్‌లూం పరిశ్రమ కోసం కొత్త పాలసీ తీసుకవస్తుందని అన్నారు.

పొలిమేర వరకు తరిమికొడతాం : మంత్రి పొన్నం

శవ రాజకీయాలు చేస్తూ పది సంవత్సరాలు అధికారంలో ఉండి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేసే పరిస్థితి వస్తే తప్పులు, అప్పులు చేసిన వారిని పొలిమేర వరకు తరిమికొడతామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సిరిసిల్లలో ఆత్మహత్యలు దురదృష్టకరమని అన్నారు. గత ప్రభుత్వంకు కేవలం బతుకమ్మ చీరలపై ధ్యాసే ఉండేదని కాంగ్రెస్‌ ప్రభుత్వం జీవో నెంబర్‌ 1 ద్వారా బట్ట అర్డర్లు తెలంగాణ వ్యాప్తంగా ఇస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ఇంచార్జ్‌ కేకే మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ మాజీ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, కాంగ్రెస్‌ నాయకులు సంగీతం శ్రీనివాస్‌, అకునూరి బాలరాజు, యెల్లె లక్ష్మీనారాయణ, వైద్యశివప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు గాజుల బాలయ్య దీపదాస్‌కు వినతిపత్రం అందించారు.

Updated Date - Apr 28 , 2024 | 12:16 AM