Share News

నేతన్నలను రెచ్చగొడుతున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:47 AM

నేతన్నలకు కల్లబొల్లి మాటలు చెప్పి బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు రెచ్చగొడుతున్నాయని ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో మాజీ శాసనసభ్యుడు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం, బృందాదేవిల కుమారుడు డాక్టర్‌ వేణుగోపాల్‌, డాక్టర్‌ అరుణాచల దేవి కుమారుడు కాళీ చరణ్‌ దత్తకు ఉపనయన కార్యక్రమానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరై ఆశీర్వదించారు.

నేతన్నలను రెచ్చగొడుతున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్‌బాబు

- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

గంభీరావుపేట: ఏప్రిల్‌ 21: నేతన్నలకు కల్లబొల్లి మాటలు చెప్పి బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు రెచ్చగొడుతున్నాయని ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో మాజీ శాసనసభ్యుడు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం, బృందాదేవిల కుమారుడు డాక్టర్‌ వేణుగోపాల్‌, డాక్టర్‌ అరుణాచల దేవి కుమారుడు కాళీ చరణ్‌ దత్తకు ఉపనయన కార్యక్రమానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరై ఆశీర్వదించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. పదేళ్లుగా ఇక్కడి ప్రాంతానికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఇంతవరకు ఎలాంటి అవకాశాలు కల్పించారని బండి సంజయ్‌ని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పదేళ్లలో ఇరవై కోట్లమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిర్లక్ష్యానికి గురిచేశారని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి మండిపడ్డారు. బ్యాంకు ఖాతా ఉన్న ప్రతితఈ ఒక్కరికి 15 లక్షల రూపాయలు ఖాతాలో వేస్తామని నయా పైసా వేయకుండా మోసం చేశారని ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి రెండు సార్లు మద్దతు పెంచి ఉరుకున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యం జరిగితే నష్టపోయిన రైతాంగాన్ని బీజేపీ ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. 2107 నుంచి ఇంతవరకు రైతన్నలను ఆదుకున్న పాపాన పోలేదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంటే బురద జల్లే యత్నం బీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తోందన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌, అవినీతి, విషయంలో నిశ్శబ్ధంగా ఉన్న అటు బీజేపీకి, ఇటు బీఆర్‌ఎస్‌ పార్టీకి ఏవిధంగా ఓటు వేస్తారన్నారు. ఏ నైతిక హక్కుతో ఓటేయాలని అడుగుతున్నారో తెలపాలన్నారు. పది సంవత్సారాల కాలంలో ప్రజలు విసిగివేసారి మార్పు కోరుకున్నారన్నారు.

ఫ నేతన్నల సంక్షేమానికి కృషి

నేతన్నల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి శ్రీధర్‌బా బు పేర్కొన్నారు. నేత కార్మికులు అయోమయానికి గురికావొద్దన్నారు. నేత కార్మికుల సమస్యలను ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువస్తున్నారన్నారు. నేతన్నలకు అండగా ఉంటడం కోసం మొదటి విడతలో రూ. 50 కోట్లు మంజూరు చేశారన్నారు. నేతన్నలను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, బ్లాక్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు దొమ్మాట నర్సయ్య, సద్ది లక్ష్మారెడ్డి, బుగ్గ కృష్ణమూర్తి, పందిర్ల సుధాకర్‌గౌడ్‌, హైమద్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2024 | 12:47 AM