ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధన
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:21 AM
ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మెరుగైన విద్యా బోధనతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.

పెద్దపల్లి రూరల్, జూన్ 6 : ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న మెరుగైన విద్యా బోధనతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. గురువారం మండలంలోని పెద్దబొంకూర్‌లో జడ్పీ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని వారి పిల్లలను తప్పనిసరిగా చదివించాలని, ప్రతిఒక్క పిల్లవాడు పాఠశాలలో న మోదయ్యే దిశగా బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం జూన్ 6 నుం చి జూన్ 19 వరకు నిర్వహిస్తుందని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, సిబ్బంది ఇంటింటికి తిరిగి ప్రభుత్వ విద్యాలయా ల్లో విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన వస తులు, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో వస్తున్న మెరుగైన ఫలితాలను తల్లిదండ్రులకు వివరిస్తూ అధిక సం ఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు అయ్యేలా చూడా లని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన నాణ్యత, అనుభ వం కలిగిన ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువు చెబుతారని, ప్ర భుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధిపై దృష్టి పెట్టడం జరుగుతుందని, విద్యార్థులకు అర్థమయ్యే దిశగా కొత్త బోధనా పద్ధ తులను అమలుచేస్తున్నామన్నారు. ప్రభుత్వపాఠశాలల్లో ప్రతి విద్యా ర్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందని, దీని ఫలితంగా ఇటీ వలే వచ్చిన పదవ తరగతి ఫలితాల్లో జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాల ల్లో 97 శాతం మేర విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. ప్రైవేట్ కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలను సాధిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో ఎటువంటి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్‌గా ప్రతి నెల పేరెంట్, టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నా మని, విద్యార్థుల పురోగతే లక్ష్యంగా ఎప్పటి కప్పుడు తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రపంచంలోనీ అనేక దేశాలు విఫలమైన చంద్రయాన్ ప్రయోగాన్ని భారత శాస్త్రవేత్తలు విజయవంతం చేశారని, అటువంటి శాస్త్రవేత్తలు సైతం ప్రభుత్వ పాఠశాలలోనే చదివారని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఉచితంగా అందించడంతో పాటు వారికి అవసర మైన యూనిఫామ్, పాఠ్య, నోట్ పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపా యాలను వినియోగించుకునే విధంగా తల్లిదండ్రులు వారి పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్ పాఠశాలల్లోని విద్యార్థులతో సంభాషిస్తూ వారు పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి డి. మాధవి మాట్లాడుతూ 19వరకు బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటి సర్వే చేపట్టి విద్యార్థుల ను ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేసేందుకు కృషి చేయడం జరు గుతుందన్నారు. విద్యార్థులకు ముఖ్యమైన పాఠ్యాంశాలను వివరించ డం జరుగుతుందని తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ కార్నర్లను ఏర్పాటు చేశామని, గ్రంథాలయంలో విద్యార్థుల కోసం మంచి కథల పుస్తకాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాల ల్లో పిల్లలను చేర్చాలని, అనవసరంగా ప్రైవేటు పాఠశాలల్లో చేర్చి డబ్బు వృధా చేసుకోవద్దని, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఐఐ టి, నీట్ ఫలితాల్లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నారని, క్రీడా పోటీ లలో సైతం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అధికంగా రాణిస్తున్నార న్నారు. పాఠశాల అకడమిక్ అధికారి డాక్టర్ పి.ఎం. షేక్ మాట్లాడు తూ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి వసతులు, ఆటస్థలం అందుబా టులో ఉన్నాయని, నైపుణ్యం, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారన్నారు. అనంతరం కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా చేరుతున్న విద్యార్థులకు అడ్మిషన్ ఫారం అందజేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్‌పర్సన్ సమత, అడిషనల్ డీఆర్డి వో రవికుమార్, ఏపీఎం సంపత్, ఏపీవో రమేష్‌బాబు, అంగన్వాడీ టీచర్స్ సుధా తదితరులు పాల్గొన్నారు.