Share News

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jan 14 , 2024 | 11:47 PM

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హుజూరాబాద్‌ ఏసీపీ జీవన్‌రెడ్డి, సీఐ బర్పటి రమేష్‌ అన్నారు.

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

జమ్మికుంట, జనవరి 14: సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హుజూరాబాద్‌ ఏసీపీ జీవన్‌రెడ్డి, సీఐ బర్పటి రమేష్‌ అన్నారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని మాయమాటలు చెబుతూ ఆన్‌లైన్‌ ఉద్యోగాల పేరిటా ఎర వేస్తూ మోసం చేస్తున్నారన్నారు. జమ్మికుంటకు చెందిన ఓ బాధితుడికి ఇండియన్‌ బుల్స్‌ అనే కంపెనీ నుంచి రూ.లక్ష లోన్‌ సాంక్షన్‌ అయినట్లు సైబర్‌ నేరగాడు ఫేక్‌లెటర్‌ సృష్టించి పంపించడం జరిగిందన్నారు. అది చూసి నిజం అని భావించిన వ్యక్తి నుంచి డిపాజిట్‌, రిజిస్ట్రేషన్‌, ఇన్సూరెన్స్‌ పేరిట రూ.25వేలు లాగాడని తెలిపారు. బాధితుడు మళ్లీ ఫోన్‌ చేయగా సదరు వ్యక్తి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వచ్చిందని, దీంతో మోసపోయినట్లు గుర్తించి పోలీస్‌లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలాం టి సంఘటనలు జరిగిన సమయంలో వెంటనే 1930నెంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.

Updated Date - Jan 14 , 2024 | 11:47 PM