అంజన్న చెంతకు అయోధ్య రాముని పాదుకలు
ABN , Publish Date - Jan 18 , 2024 | 12:19 AM
అయోధ్య రామమందిరం నుంచి పాదయాత్ర ద్వారా తీసుకువచ్చిన రాముని పాదుకలు కొండగట్టు అంజన్న సన్నిధానానికి చేరుకున్నాయి.
- స్వాగతం పలికిన ఎంపీ బండి సంజయ్
మల్యాల, జనవరి 17: అయోధ్య రామమందిరం నుంచి పాదయాత్ర ద్వారా తీసుకువచ్చిన రాముని పాదుకలు కొండగట్టు అంజన్న సన్నిధానానికి చేరుకున్నాయి. చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధానర్చకులు ఆత్మరాం మహారాజ్‌తో పాటు పలువురు శిష్యులు పాదుకలు తీసుకురాగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దిగువ కొండగట్టులో స్వాగతం పలికారు. ఆత్మరాం మహారాజ్‌తో పాటు శిష్యులను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వందలాదిగా భక్తులు పాదుకలకు స్వాగతం పలికారు. అనంతరం పాదుకలను అంజన్న ఆలయానికి చేర్చారు. పాదుకలను కొండగట్టు ప్రాం తంలో భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయనున్నట్లు భక్తులు తెలిపారు. కార్యక్రమంలో భక్తులతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ధర్మపురి: అయోధ్య నుంచి రాముని పాదుకలతో పాదయాత్రగా బయలుదేరిన సురేష్ ఆత్మారాంజీ బృందం ధర్మపురి క్షేత్రానికి బుధవారం చేరుకుంది. జిల్లాలోని కొండగట్టు వెళుతున్న బృందం క్షేత్రానికి చేరుకోగా నంది చౌక్ వద్ద మంగళ వాయిద్యాల మధ్య వేదపండితులు, అర్చకులు, భక్తులు వెంటరాగా మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం ఇసుక స్తంభం మీదుగా స్థానిక లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సురేష్ ఆత్మారాంజీ బృందం సభ్యులు చేరుకున్నారు. అనంతరం రాముని పాదుకలను శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి చెంతన ఉంచారు. అనంతరం ఆలయ ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచారి, రమణాచార్యా, నరసింహమూర్తి, అర్చకులు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. సురేష్ ఆత్మారాంజీ బృందం సభ్యులు స్వామి దర్శనం చేసు కున్నారు. స్వామి తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా సురేష్ ఆత్మారాంజీ మాట్లాడుతూ రాముని పాదుకలతో పాదయాత్రగా బయలు దేరి ఈ క్షేత్రానికి చేరుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి నుంచి తమ బృందం సభ్యులు కొండగట్టు చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. రామరాజ్య స్థాపన కోసం ఈ నెల 22న అయోధ్య రాముని విగ్రహ పునః ప్రతిష్ట సందర్భంగా కొండగట్టు పరిసరాల్లో పాదుకలను ప్రతిష్ఠాపన చేస్తామని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్, టీపీసీసీ సభ్యులు సంగనభట్ల దినేష్, బ్రాహ్మణ సంఘం అధ్యక్షు లు ఇందారపు రామయ్య, ప్రధాన కార్యదర్శి నందగిరి గిరిధర్, సంతోషీమాతా ఆలయ అర్చకులు మధ్వాచారి రాంకిషన్, పురాణపు సాంబ మూర్తి, తిరుమన్ దాసు సత్యనారాయణ, కాసర్ల వెంకటరమణ, రాజేష్, గణేష్, మహేందర్, కాంత న్న, ఆలయ సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.