Share News

నులి పురుగుల నివారణపై అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:27 AM

నులి పురుగుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, 1 నుంచి 19 సంవత్సరాల వయస్సులోపు పిల్లలం దరికీ తప్పనిసరిగా అల్బెండజోల్‌ మాత్రలు వేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ జే.అరుణశ్రీ సంబంధిత అధికారులను సూచించారు.

నులి పురుగుల నివారణపై అవగాహన కల్పించాలి

పెద్దపల్లిటౌన్‌, ఫిబ్రవరి 1: నులి పురుగుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, 1 నుంచి 19 సంవత్సరాల వయస్సులోపు పిల్లలం దరికీ తప్పనిసరిగా అల్బెండజోల్‌ మాత్రలు వేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ జే.అరుణశ్రీ సంబంధిత అధికారులను సూచించారు. గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సమీకృత జిల్లా కలెక్టరేట్‌ లోని తన చాంబర్‌లో నులిపురుగుల నివారణకు సంబంధిత అధికారు లతో సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ నులి పురుగులు చాలా ప్రమాదకరమని, వీటితో రక్తహీనతతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తు తాయని, వీటిని నివారిస్తే ఆరోగ్యంగా వుండవచ్చునన్నారు. నులిపురు గుల నియంత్రణ చాలా కీలకమైన అంశమని, దీని పట్ల ఎవరు నిర ్లక్ష్యంగా వ్యవహరించకుండా వారికి కేటాయించిన విధులను సమన్వ యంతో కట్టుదిట్టంగా నిర్వహించి 1 నుంచి 19 సంవత్సరాల వయస్సులో గల పిల్లలందరికీ తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మందులు అందించాలన్నారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం పురస్క రించుకొని ఫిబ్రవరి 12న జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, పైవ్రేట్‌ పాఠ శాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో నులిపురుగుల నివారణ మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 1706 అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ఎయిడెడ్‌, పైవ్రేట్‌ పాఠశాలలో, జూని యర్‌ కళాశాలలో, జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 2లక్షల 41వేల721 మంది 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు అల్బెండజోల్‌ మాత్రలను పంపిణి చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 26లక్షల 5వేల 93 (10 శాతం బఫర్‌ స్టాక్‌) నులి పురుగుల నివారణ మాత్రలను అందుబాటులో ఉంచుకున్నా మని, జిల్లాలోని ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఉపాధ్యా యులు, ప్రధానోపాధ్యాయు లు, ఇతర సిబ్బంది నులి పురు గుల నివారణ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు అదనపు కలెక్టర్‌కు వివరించా రు. అనారోగ్య కారణాలు, వివి ధ ఇతర కారణాల వల్ల మాత్ర లు వేసుకొని విద్యార్థులకు తప్పనిసరిగా ఫిబ్రవరి 19 నాడు అందించాలని, జిల్లావ్యా ప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలకు ముందస్తు సమాచారం అందించి పూర్తిస్థాయిలో విద్యార్థులు ఫిబ్రవరి 12హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ కే.ప్రమోద్‌ కుమార్‌, డిప్యూటీడీఎంహెచ్‌వో డాక్టర్‌ కృపాబాయ్‌, జిల్లాఆసుపత్రి సూప రింటెండెంట్‌ డాక్టర్‌ రమాకాంత్‌, డాక్టర్‌ రవి సింగ్‌, వైద్య అధికారులు డాక్టర్‌ అప్పారావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్‌ఖాన్‌, జిల్లా విద్యా శాఖ అధికారి డి.మాధవి, జిల్లా ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి కల్పన, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జే. రంగా రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్లు, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 12:27 AM