పకడ్బందీగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే
ABN , Publish Date - Oct 04 , 2024 | 12:22 AM
గ్రామంలోని ప్రతి కుటుం బాన్ని కవర్ చేస్తూ ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
ముత్తారం, అక్టోబర్ 3: గ్రామంలోని ప్రతి కుటుం బాన్ని కవర్ చేస్తూ ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టర్ కోయ శ్రీహర్ష ముత్తారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఫ్యామిలీ డిజి టల్ సర్వే పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన మండలం లోని దర్యాపూర్ గ్రామాన్ని కలెక్టర్ సందర్శించి జరుగు తున్న సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ చేసేందుకు చేపట్టిన సర్వేలో గ్రామంలోని ప్రతి కుటుంబం వివరాలు పకడ్బందీగా సేకరించాలని, 5రోజుల్లో కుటుంబ వివ రాల సేకరణ పూర్తిచేయాలని, ఈనెల 9న సేకరించిన వివరాల స్కూట్రినీ చేసి, 10న ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించి సమాచారంతో కూడిన నివేదిక సమర్పించాలని తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు, పెండింగ్ భూసమస్యల వివరాలు తెలుసు కొని వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. అలాగే ముత్తారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎన్‌సీడీ సర్వే అమలవుతున్న తీరు, ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాల వివరాలు అడిగితెలుసుకున్నారు. ఆసుప త్రిలో అవసరమైన మేర మందుల స్టాక్ అందుబాటులో ఉంచుకో వాలని అధికారులకు సూచించారు. రోగులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవా లన్నారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్ సుమన్, ఎంపీడీవో సురేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీలతో పాటు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.