Share News

అభివృద్ధిని విస్మరించి అరాచకాలు..

ABN , Publish Date - May 15 , 2024 | 12:49 AM

తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, మంత్రి మంథని నియోజకవర్గంలో అభివృద్ధిని విస్మరించి ఆరా చకాలను ప్రొత్సహిస్తున్నారని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు ఆరోపించారు.

అభివృద్ధిని విస్మరించి అరాచకాలు..

మంథని, మే 14: తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, మంత్రి మంథని నియోజకవర్గంలో అభివృద్ధిని విస్మరించి ఆరా చకాలను ప్రొత్సహిస్తున్నారని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరుల మాట్లాడుతూ.. మంథని నియోజవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం, తాడిచర్ల-భూపాపల్లి రోడ్డుకు నిధులు మంజూరు చేయించకుండా, ఓడేడ్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొసలి కన్నీళ్లు కార్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెట్టకుండా ప్రజల ను భయాందోళనలకు గురిచేసే విధంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమీక్షలు చేయకుండా బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులపై రౌడీషీట్లు ఎలా ఓపెన్‌ చేయాలని, ఇక్కడ ఉన్న సంపదను ఎలా తర లించాలనే ఆలోచన చేస్తున్నారన్నారు. మంథని నుంచి మొదలు మహదేవపూర్‌ వరకు ఇసుక అక్రమ రవాణాను ప్రొత్సహిస్తున్నారని, ఎక్కడ చూసినా ఇసుక డంపు లే దొరుకుతున్నాయన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఇక్కడ మంథని ఎమ్మెల్యే ఒక్కటేనని విమర్శించారు. ఎన్నికల సమయంలో రాజ్యాంగం మారుస్తారని బీజేపీపై విష ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేలా రాజ్యాంగంపై అవగాహన కల్పిం చే బాధ్యత తామే తీసుకుంటున్నామన్నారు. రాజ్యాంగం గురించి తెలియకపోవడం మూలంగానే 50ఏళ్లుగా ఒక కుటుంబం, కాంగ్రెస్‌ పార్టీ ఇంత పెద్ద సమాజాన్ని ఏలు తున్నదన్నారు. భయానికో.. ప్రలోభాలకో పదవుల కోసం పార్టీ మారినోళ్లు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలు మారిన వారు సైతం వారి ఇంట్లో పెన్షన్‌ రావాలన్నా.. రైతు బంధు రావాలన్నా.. ఇతర పథకాలు రావాలన్నా.. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీనే పోరాటం చేయాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో పది మంది ఉన్నా పట్టువదలకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేయడంతో పాటు ఆరు గ్యారెంటీలు అమలయ్యేలా పోరాటం చేస్తామన్నారు. ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బుద్ధి చెప్పేలా ప్రజలంతా బీఆర్‌ఎస్‌కు ఓటు ద్వారా మద్దతు తెలిపారని, పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్‌ విజయం ఖాయమ న్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ నేతలు జక్కు రాకేష్‌, తగరం శంకర్‌లాల్‌, ఏగో ళపు శంకర్‌గౌడ్‌, సత్యనారాయణలు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2024 | 12:49 AM