Share News

అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పూర్తి చేయాలి

ABN , Publish Date - May 29 , 2024 | 11:41 PM

అమ్మ అదర్శ పాఠశాలల కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మరమ్మతు పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదే శించారు.

అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పూర్తి చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

తంగళ్లపల్లి/ముస్తాబాద్‌, మే 29: అమ్మ అదర్శ పాఠశాలల కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మరమ్మతు పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదే శించారు. బుధవారం తంగళ్లపల్లి మండలం మండెపల్లి, నేరెళ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలతోపాటు ముస్తాబాద్‌ మండలం పోత్గల్‌, చీకోడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలను పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పథకం కింద చేపట్టిన విద్యుత్‌ పరికరాలు, తాగునీటి, వసతి మరుగుదొడ్లకు మరమ్మతుల పనులు కొనసాగుతుండగా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అదనపు కలెక్టర్‌ పూజారి గౌతమి వివరాలు తెలుసుకున్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలని నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.

గడువులోగా యూనిఫాం అందించాలి

గడువులోగా యూనిఫాం అందించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. బుధవారం తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని భాగ్యలక్ష్మీ మహిళా శక్తి టైలరింగ్‌ సెంటర్‌లో స్కూల్‌ విద్యార్థులకు యూనిఫాం కుడుతుండగా పరిశీలించారు. ఈ సందర్భంగా యూనిఫాం కుడుతున్న మహిళలతో మాట్లాడారు. రోజు ఎన్ని కుడతారని, ఎన్ని రోజులు పని దొరుకుతుందని, మిగతా రోజుల్లో ఏం పని చేస్తారని అడిగి తెలుసుకున్నారు. యూనిఫాం త్వరగా కుట్టి ఇవ్వాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 41680 యూనిఫాంలు లక్ష్యంకాగా ఇప్పటివరకు 20314 యూనిఫాంలు పూర్తయ్యాయన్నారు. జిల్లాలో మొత్తం 38 మహిళా సమాఖ్యల పరిధిలోని 536 మంది మహిళలకు ఉపాధి లభిస్తున్నట్లు చెప్పారు. డీఆర్‌డీవో శేషాద్రి, డీఈవో రమేష్‌కుమార్‌, ఆర్‌అండ్‌బీ డీఈ నాగరాజు, డీపీఎం సుధారాణ, తహసీల్దార్‌ వెంకటలక్ష్మీ, ఎంపీడీవో జోగం రాజు, ఎంఈవో రఘుపతి ఉన్నారు.

Updated Date - May 29 , 2024 | 11:41 PM