Share News

పెద్దపల్లి టికెట్‌ వంశీకి కేటాయించడం సరికాదు

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:17 AM

పెద్దపల్లి పార్లమెంట్‌ టికెట్‌ వంశీకి కేటాయించడం సరికాదని ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ అన్నారు.

పెద్దపల్లి టికెట్‌ వంశీకి కేటాయించడం సరికాదు

కోల్‌సిటీటౌన్‌, ఏప్రిల్‌ 17: పెద్దపల్లి పార్లమెంట్‌ టికెట్‌ వంశీకి కేటాయించడం సరికాదని ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ అన్నారు. బుధవారం గోదావరిఖనిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలోని రెండు అసెంబ్లీ స్థానాలు చెన్నూరు, బెల్లంపల్లిలను వివేక్‌, వినోద్‌ ఎమ్మెల్యేగా ఉన్నారని, తాజాగా పార్లమెంట్‌ టికెట్‌ కూడా వివేక్‌ కుమారుడు గడ్డం వంశీకి కేటాయించడం ద్వారా కాకా కుటుంబానికి పట్టా చేసినట్టు అయిందని విమర్శించారు. ఏళ్ల తరబడి మాదిగలు కాంగ్రెస్‌ పార్టీకి సేవ చేసినా ఆ పార్టీ పట్టిం చుకోలేదని, అవసరాల కోసం పార్టీ మారిన వివేక్‌ కుటుంబానికి మాత్రం టిక్కెట్లు కేటాయించడం సరికాదన్నారు. మాదిగలు వివేక్‌కుటుంబానికి, కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయవద్దన్నారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు యాసర్ల రాజ్‌కు మార్‌(తిమోతి), మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు తగరం మధురాజు, లింగపల్లి సుధా కర్‌, ఇప్ప రాజన్న, అశోక్‌, మేడి ప్రవీణ్‌, ప్రేమ్‌కుమార్‌, భూమన్న, రాజేష్‌, శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:17 AM