Share News

బీఆర్‌ఎస్‌కు ఆకారపు భాస్కర్‌రెడ్డి రాజీనామా

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:01 AM

బీఆర్‌ఎస్‌ నాయకుడు ఆకారపు భాస్కర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు.

బీఆర్‌ఎస్‌కు ఆకారపు భాస్కర్‌రెడ్డి రాజీనామా

సుభాష్‌నగర్‌, జనవరి 17: బీఆర్‌ఎస్‌ నాయకుడు ఆకారపు భాస్కర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు. బుదవారం నగరంలోని ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరానని తెలిపారు. ఆ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం తనను నిర్లక్ష్యం చేసిందని, ప్రోత్సహించకుండా అవమానాలకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు ప్రజలకు అందుబాటులో లేకుండా అనేక ప్రజావ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్ళినప్పటికి పట్టించుకోలేదన్నారు. అందుకే బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే వెయ్యి మందితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీల నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిలా కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా గెలిపించుకుంటామన్నారు. సమావేశంలో వాసాల రవీందర్‌, ఎంఏ కరీం, ఎండీ ఆసిఫ్‌, తాళ్లపల్లి అంజయ్య, ఎండీ సలీం, ఎండీ ఖదీర్‌, ఎండీసయ్యద్‌గౌస్‌, ఎంఏ నయీం, కె జగన్‌రెడ్డి, ఎండీ ఖుర్షీద్‌ అలీ, ఎంఏ రహమాన్‌, ఎండీ తహసీన్‌, కాసారపు ఎల్లయ్య, సయ్యద్‌ఖాజా గౌసుద్దీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 12:01 AM