Share News

రైతులకు ప్రయోజనకరంగా వ్యవసాయ పరపతి సంఘాలు

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:25 AM

వ్యవసాయ పరపతి సంఘాలు రైతులకు ప్రయోజన కరంగా ఉంటాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు.

రైతులకు ప్రయోజనకరంగా వ్యవసాయ పరపతి సంఘాలు

ఎలిగేడు, సెప్టెంబరు 20: వ్యవసాయ పరపతి సంఘాలు రైతులకు ప్రయోజన కరంగా ఉంటాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శుక్రవారం ఎలిగేడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సర్వసభ్య సమావేశం చైర్మన్‌ గోపు విజయభాస్కర్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు హాజరై ప్రసంగించా రు. వ్యవసాయ పరపతి సంఘాలు రైతులకు ప్రయోజనకరంగా ఉంటాయని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతి రైతుకు రూ.2లక్షల రుణమాఫీ చేసిం దని, ఆ ఘనత కాంగ్రెస్‌ పార్టీకి దక్కిందన్నారు. నిరంతరం రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నప్పటికీ బీఆర్‌ఎస్‌ నాయకులు పనిగట్టుకొని కాంగ్రెస్‌ పార్టీని బదనాం చేస్తున్నారని ఆరోపించారు. మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. అబద్ధాల పునాదుల మీద పుట్టిందే బిఆర్‌ఎస్‌ పార్టీ అని ఎద్దేవా చేశారు. రైతుల పంట కొనుగోలు విషయంలో ప్రభుత్వానికి, రైతులకు సహకార సంఘాలు వారధిలాగా పనిచేస్తున్నాయని కొనియాడారు. గత పాలకుల హయాంలో పండించిన పంటలకు తరుగు పేరుతో మోసం చేసి కోట్లు గడించారని పేర్కొన్నారు. రైతులను రాజులుగా చేయడం కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యం అని అందుకు సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు వడ్ల కొనుగోలులో గింజ కట్‌ చేయకుండా కాం టా వేయిస్తానని భరోసా ఇచ్చారు. పీఎస్‌సీఎస్‌ చైర్మన్‌ గోపు విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ సంఘంలో 1913మంది సభ్యులు ఉన్నారని వారి వాటా ధనం రూ.1,36,24,462 బ్యాంకులో ఉందని 2023-2024అడిట్‌ రిపోర్ట్‌ ప్రకారం సంఘం మొత్తం ఆదాయం రూ.56,47,091 నికరం ఆదాయం 15,82,040తో ఏ గ్రేడులో ఉంటుందన్నారు. సమావేశంలో తహసీల్దార్‌ బషీరోద్దీన్‌, ఎంపీడోఓ భాస్కర్‌రావు, ఏవో ఉమాపతి, అసిస్టెంట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ వెంకటేశ్వర్లు, బ్యాంకు మేనేజర్‌ రమేష్‌, మాజీ చైర్మన్‌ నరహరి సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సామ రాజేశ్వర్‌ రెడ్డి, డైరెక్టర్లు తాటిపల్లి రమేష్‌బాబు, కరివేద సుధాకర్‌రెడ్డి, ఏలేటి వెంకట్‌రెడ్డి, కొప్పర సత్తమ్మ, రెవెల్లి కనుకమ్మ, అసంపల్లి కమలమ్మ, రవి, దుగ్యాల రాజేశ్వర్‌రావు, దాసరి రాజిరెడ్డి, కొండ తిరుపతిగౌడ్‌, తీగల కనుకయ్య, తొంటి మధుకర్‌, సీఈవో విక్రమ్‌, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 28మంది లబ్ధిదారులు రూ.28,03,248విలువగల చెక్కులను ఎమ్మెల్యే విజయరమణారావు పంపిణీ చేశారు.

Updated Date - Sep 21 , 2024 | 12:25 AM