కాట్నపల్లి ఘటనలో నిందితుడికి కఠినశిక్ష పడేలా చర్యలు
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:23 AM
సుల్తానాబాద్ మండలం కాట్న పల్లి రైస్‌మిల్‌లో జరిగిన సంఘ టన అమానుషమని, నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ళ శ్రీధర్‌బాబు, రాష్ట్ర పంచా యతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

పెద్దపల్లిటౌన్, జూన్ 16 : సుల్తానాబాద్ మండలం కాట్న పల్లి రైస్‌మిల్‌లో జరిగిన సంఘ టన అమానుషమని, నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ళ శ్రీధర్‌బాబు, రాష్ట్ర పంచా యతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఆదివారం సుల్తానాబాద్ మండ లం కాట్నపల్లి గ్రామంలోని రైసు మిల్లు వద్ద ఈనెల 13న ఆరేళ్ళ చిన్నారిపై జరిగిన ఘటన ప్రదే శాన్ని మంత్రులు దుదిళ్ళ శ్రీధర్ బాబు, సీతక్క పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రామగుండం, పెద్దపల్లి ఎమ్మెల్యేలు మక్కన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, చింతకుంట విజ యరమణారావులతో కలిసి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకు న్నారు. అనంతరం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో వారు మాట్లాడారు. తల్లిదండ్రుల మధ్య నిద్రపోతున్న చిన్నారిని ఎత్తుకెళ్లి రైస్ మిల్లులో పని చేసే బీహార్‌కు చెందిన వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేశాడని మంత్రులు ఆవేదన వ్యక్తం చేశా రు. ఈ సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రివర్గం, ఎంపీ, సహచర ఎమ్మెల్యేలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ మరింత భద్రత కల్పన, నిఘా పెంపు, డ్రగ్స్ మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి దురలవాట్లకు గురైన వారిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. నేరం చేసిన వ్యక్తులకు వెంటనే శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడినవారు ఇటు వంటి దారుణాలకు పాల్పడుతున్నారన్నారు. డ్రగ్స్, గంజాయిని ఉక్కు పాదంతో అణచి వేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని, వ్యక్తి ఆరోగ్యంతో పాటు సమాజానికి సైతం డ్రగ్స్, గంజాయి నష్టం చేస్తున్నాయని వివరించారు. ప్రతి ఇంటిలో పని చేసే డొమెస్టిక్ హెల్పర్, ప్రతి పరిశ్రమలో పనిచేసే వర్కర్ల బ్యాక్ గ్రౌండ్‌చెక్ చేసిన తర్వాతే వారికి ఉపాధి కల్పించాలని సూచించారు. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం ఎవరూ తీర్చలేరని, ఆ కుటుం బానికి అండగా నిలిచేందుకు చిన్నారి తండ్రికి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌తో చర్చించి ఉద్యోగం కల్పించనున్నట్లు, వారికి ఇంటి నిర్మా ణానికి స్థలంతో పాటు ఇల్లు మంజూరు, ఆ తల్లిదండ్రుల వద్ద ఉన్న మరో చిన్నారి చదువు బాధ్యతలను సైతం ప్రభుత్వం తీసుకుంటుం దని వారు స్పష్టం చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ సుల్తానాబాద్‌లో జరిగిన చిన్నారి సంఘటన పట్ల యావత్ రాష్ట్రం దిగ్ర్భాంతికి గురిచేసిందని, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ ఘటన జరగడం దురదృష్టకర మన్నారు. బాధిత కుటుంబానికి సంబంధిత రైస్‌మిల్ నుంచి ఐదు న్నర లక్షల రూపాయల పరిహారం, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రిని కలిసి చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున మరో రెండున్నర లక్షల పరిహారం అందించాలని నిర్ణయిం చినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 200లకు పైగా రైస్ మిల్లులు ఉంటాయని, చాలా కాలంగా సీజన్ సమయంలో ఒరిస్సా, బీహార్, మధ్యప్రదేశ్ నుంచి కార్మికులు ధాన్యం కొనుగోలు సమ యాల్లో వచ్చి పని చేస్తారని, ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగ లేదని, దీని పట్ల చాలా బాధపడుతున్నామని అన్నారు. ఈ పర్యటనలో మంత్రుల వెంట కలెక్టర్ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, డీసీపీ ఎం.చేతన, ఏసీపీలు గజ్జి క్రిష్ణ, రమేష్, సీఐ క్రిష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారు లు తదితరులు పాల్గొన్నారు.