Share News

తైబజార్‌ నిధులు కేటాయించేలా తీర్మానం చేయాలి

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:53 AM

పెద్దపల్లి మున్సిపల్‌ ఆధ్వర్యంలో టెండర్‌ ద్వారా నిర్వహించిన తై బజా ర్‌ వసూళ్లను నిలుపుదల చేసినందున రూ. కోట్ల రూపాయలు నిధులను విడుదల చేయాలని కోరు తూ తీర్మానం చేసి లేఖను స్థానిక ఎమ్మెల్యేకు అం దించాలని 8వ వార్డు కౌన్సిలర్‌ బొంకూరి భాగ్య లక్ష్మి కోరారు.

తైబజార్‌ నిధులు కేటాయించేలా తీర్మానం చేయాలి

పెద్దపల్లిటౌన్‌, జూలై 27: పెద్దపల్లి మున్సిపల్‌ ఆధ్వర్యంలో టెండర్‌ ద్వారా నిర్వహించిన తై బజా ర్‌ వసూళ్లను నిలుపుదల చేసినందున రూ. కోట్ల రూపాయలు నిధులను విడుదల చేయాలని కోరు తూ తీర్మానం చేసి లేఖను స్థానిక ఎమ్మెల్యేకు అం దించాలని 8వ వార్డు కౌన్సిలర్‌ బొంకూరి భాగ్య లక్ష్మి కోరారు. ఈ మేరకు శనివారం చైర్‌పర్సన్‌ మమతరెడ్డి, కమిషనర్‌ వెంకటేష్‌లకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే విజయరమణారావు అభి ప్రాయం మేరకు తైబజార్‌ వసూళ్లను నిలుపుదల చేసినందున మున్సిపల్‌ ఆదాయం కోల్పోయిందని, పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఆటంకం కలి గిందని ఆమె వివరించారు. తైబజార్‌ ద్వారా సమ కూరే కోట్ల రూపాయల నిధులు మున్సిపల్‌ కు కేటాయించేలా ఎమ్మెల్యేను కోరాలని వినతిలో పేర్కొన్నారు. సాధారణ సమావేశంలో తీర్మానం చేసి, తీర్మానంతో కూడిన లేఖను ఎమ్మెల్యేకు అం దించాలని భాగ్యలక్ష్మి విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jul 28 , 2024 | 12:53 AM