Share News

రంగుల హరివిల్లు

ABN , Publish Date - Jan 08 , 2024 | 01:11 AM

జిల్లా కేంద్రంలోని జ్యోతి హైస్కూ ల్‌ వేదికగా ఆదివారం ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో కెనారా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు పవర్‌డ్‌ బై ఎయిమ్స్‌ విద్యా సంస్థలు, రియల్‌ పార్ట్‌నర్స్‌ స్వర్గసీమ సుకేతన, స్థానిక పార్ట్‌నర్‌ సూర్య గ్లోబల్‌ హైస్కూల్‌, మానస స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ల సహకారాలతో ఘనంగా జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి 126 మంది మహిళలు, విద్యార్థినులు హాజరై అవనికి రంగులు అద్దారు.

రంగుల హరివిల్లు

జగిత్యాల, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని జ్యోతి హైస్కూ ల్‌ వేదికగా ఆదివారం ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో కెనారా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు పవర్‌డ్‌ బై ఎయిమ్స్‌ విద్యా సంస్థలు, రియల్‌ పార్ట్‌నర్స్‌ స్వర్గసీమ సుకేతన, స్థానిక పార్ట్‌నర్‌ సూర్య గ్లోబల్‌ హైస్కూల్‌, మానస స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ల సహకారాలతో ఘనంగా జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి 126 మంది మహిళలు, విద్యార్థినులు హాజరై అవనికి రంగులు అద్దారు. పట్టణంలోని జ్యోతి హై స్కూల్‌ ఆవరణలో జరిగిన పో టీల్లో మహిళలు పోటీ పడి ముగ్గులు వేశారు. విజేతలకు జగిత్యాల ఎమ్మె ల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేశ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, జ్యోతి, సూర్య, మానస ఎక్స్‌లెన్స్‌ పాఠశాలల డైరెక్టర్లు హరిచరణ్‌ రావు, అజితరావు, మానస ఎక్స్‌లెన్స్‌ ప్రిన్సి పాల్‌ రజిత రావు, సూర్య గ్లోబల్‌ స్కూల్‌ డైరెక్టర్‌ బోయినిపెల్లి శ్రీధర్‌ రావు లతో కలిసి బహుమతులు ప్రదానం చేశారు. మొదటి బహుమతి కింద జిల్లా సంధ్యారాణికి రూ.6 వేలు, రెండవ బహుమతి కింద బద్రి వసంతకు రూ.4 వేలు, మూడవ బహుమతి కింద బుర్ర మాధవికి రూ.3 వేలను అం దజేశారు. జగిత్యాలకు చెందిన శ్రీసాయి సూపర్‌స్పెషాలిటీ దంత వైద్యశా ల వైద్యులు కళ్యాణ్‌ కుమార్‌, అమితారెడ్డి, భారతీ ఆసుపత్రి వైద్యులు రా చకొండ నాగరత్న-శ్రీనివాస్‌ దంపతులు, ప్రముఖ వ్యాపార సంస్థ ఆనంద్‌ షాపింగ్‌ మాల్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మహంకాళి రాజన్న, ప్ర భుత్వ ఉపాధ్యాయురాలు వుజగిరి జమునల సహకారాలతో 50 మందికి క న్సోలేషన్‌ బహుమతులను అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ వై ద్యురాళ్లు నాగరత్న, అమితారెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయురాళ్లు వుజగిరి జ మున, అయిత అనిత, పాఠశాల డైరెక్టర్‌ అజితా రావులు వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ రిపోర్టర్‌ ముక్క వేణుగోపాల్‌ అధ్య క్షత వహించగా, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ రిపో ర్టర్‌ సందవేణి శ్రీనివాస్‌, ఆంధ్రజ్యోతి సిబ్బంది మురళి, రాములు, శాంతపు రావు, వేణుగోపాల్‌, పురుషోత్తం, మల్లేశం, ప్రదీప్‌, రవీందర్‌, గంగాధర్‌, సదన్‌, గణేష్‌, రమేశ్‌, ఏబీఎన్‌ కెమెరామెన్లు శ్రీనివాస్‌, ప్రవీణ్‌, ఏడీవీటీ ఇన్‌చార్జిలు రాజు పాల్గొని కన్సొలేషన్‌ బహుమతులు అందించారు.

Updated Date - Jan 08 , 2024 | 01:11 AM