Share News

కాంట్రాక్టర్‌పై హత్య కేసు నమోదు చేయాలి

ABN , Publish Date - May 24 , 2024 | 12:32 AM

రామగుండం మెడికల్‌ కళాశాల కాంట్రాక్టర్‌పై హత్య కేసు నమోదు చేయాలని డీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి కందుకూరి రాజరత్నం, మద్దెల దినేష్‌ డిమాండ్‌ చేశారు.

కాంట్రాక్టర్‌పై హత్య కేసు నమోదు చేయాలి

కళ్యాణ్‌నగర్‌, మే 23: రామగుండం మెడికల్‌ కళాశాల కాంట్రాక్టర్‌పై హత్య కేసు నమోదు చేయాలని డీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి కందుకూరి రాజరత్నం, మద్దెల దినేష్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. అనంత రం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కాంట్రాక్టర్‌ నియంతలా వ్యవహరి స్తున్నారని, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో నూతనంగా నిర్మిస్తున్న భవనం చుట్టూ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే రావుల విజయ్‌ అనే వ్యక్తి మృతి చెందాడని వారు ఆరోపించారు. మెడికల్‌ కళాశాలలో కూడా భవన నిర్మాణ పనుల్లో ఇద్దరు కార్మికులు మృతిచెందితే వారి మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా తర లించారని, కార్మికులకు సేఫ్టీ పరికాలు అందించకుండా కాంట్రాక్టర్‌ శ్రమదోపిడికి గురిచేస్తున్నాడని ఆరోపించారు. రావుల విజయ్‌ కుటుంబానికి నష్టపరిహారం చెల్లిం చాలని డిమాండ్‌ చేశారు. ప్రిన్సిపాల్‌ కూడా ఇన్ని ఘటనలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని, భవన నిర్మాణం చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాల ని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో తొడుపునూరి రమేష్‌, రాము, మొండి, ప్ర సాద్‌, రాంబాబు, రాజు, నరేంద్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2024 | 12:32 AM