Share News

2030 నాటికి వంద మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం

ABN , Publish Date - May 22 , 2024 | 12:31 AM

సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి విషయంలో భారీ దార్శనికతతో ముందుకు వెళుతున్నది...

2030 నాటికి వంద మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం

గోదావరిఖని, మే 21: సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి విషయంలో భారీ దార్శనికతతో ముందుకు వెళుతున్నది... 2030వరకు సింగరేణి సంస్థ వార్షిక ఉత్పత్తి 100మిలియన్‌ టన్నులకు చేరుకునే విధంగా పంచవర్ష ప్రణాళికను ఏర్పా టు చేసుకున్నది. ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం 10శాతం వృద్ధి రేటును పెంచుకుంటూ 2030నాటికి 100మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసిం ది. సీఎండీ బలరాంనాయక్‌ దిశానిర్దేశనంలో సింగరేణి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు, జీఎంలు, మూడవ శ్రేణి అధికారులు సమ ష్టిగా ఈ ప్రణాళికను ముందుకు తీసుకుపోయేందుకు సన్న ద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం స్థానిక ఇల్లందు క్లబ్‌లో రామగుండం, బెల్లంపల్లి, భూపాలపల్లి రీజి యన్ల జనరల్‌ మేనేజర్లు, గని మేనేజర్లు, ఓసీపీల మేనేజర్లు, ఇతర అన్నీ విభాగాల ఉన్నతాధికారులతో సంస్థ డైరెక్టర్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న ఐదేళ్లలో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, లాభాల్లో వృద్ధి, వివిధ రంగాల్లో విస్తర ణ అంశాలపై వర్క్‌షాప్‌ నడిచింది. ఈ అన్నిరంగాల్లో ప్రతి సంవత్సరం 10శాతం వృద్ధి రేటు సాధించేలా పని చేయా లని దిశానిర్దేశం చేశారు. 2029-30 సంవత్సరం నాటికి 100 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునే విధం గా ముందుకు పోవాలని డైరెక్టర్లు సూచన చేశారు. అందు లో 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచే 10శాతం వృద్ధిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని, సంస్థ లాభాల్లో కూడా ఈ వృద్ధి కనిపించే విధంగా ప్రణాళికలు సిద్ధమవు తున్నాయని వారు చెప్పారు. అందుకోసం క్షేత్ర స్థాయి నుం చి కూడా అన్ని అంశాలపై చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ ఎన్‌వీకే శ్రీనివాస్‌ మాట్లాడుతూ దేశంలో భవిష్యత్‌లో పెరిగే విద్యుత్‌ అవస రాల దృష్ట్యా బొగ్గు అవసరాలు ఉంటాయని, అందుకు సింగరేణి సంస్థ ఈ ఐదేళ్లలో 100మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా వివిధ విభాగాలు రక్షణ సూత్రాలు పాటిస్తూ ఉత్పత్తి, ఉత్పాదకత లు పెంచుకోవడానికి సిద్ధం కావాలన్నారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తిలోనే కాకుండా థర్మల్‌, సౌర, జియో థర్మల్‌ ఉత్పత్తి లో కూడా అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్న డైరెక్టర్‌(పీపీ) వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ 100మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించే విషయంపై సింగరేణిలోని ప్రతి ఉద్యోగికి అవగా హన కల్పించాలని, పోటీ ప్రపంచంలో ప్రైవేట్‌ సెక్టార్‌తో సింగరేణి పోటీపడే విధంగా ఎదగాలన్నారు. ఉత్పత్తి వ్య యం తగ్గించుకుంటూ వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేయాలన్నారు. ప్రధానంగా భూగర్భ గనుల్లో ఉత్పత్తి వ్యయాన్ని గణనీయంగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశ విద్యుత్‌ అవసరాల్లో సింగ రేణి సంస్థ తనవంతు భాగస్వామిగా ఉండడం సింగరేణీ యులకు గర్వకారణమని డైరెక్టర్‌(ఈఅండ్‌ఎం) సత్యనారా యణ అన్నారు. ఇదే వర్క్‌షాప్‌లో సింగరేణి 100మిలియన్‌ టన్నుల భవిష్యత్‌ బొగ్గు ఉత్పత్తి ప్రణాళిక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10శాతం వృద్ధి సాధించే విషయాలపై పవర్‌పా యింట్‌ ప్రజంటేషన్‌ నిర్వహించారు. ఉత్పత్తి వ్యయం తగ్గిం చుకోవడం, ఉద్యోగుల హాజరుశాతం పెంచడం, నూతన బొగ్గు గనులను ప్రారంభించుకోవడం, బొగ్గు రవాణా, యం త్రాల పని సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవ డం, వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును అందించడం, రక్షణ సూత్రాలు పాటించడం అంశాలపై కూడా పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ జరిగింది. ఈ సమీక్షలో ఆర్‌జీ-1, 2, 3 జీఎంలు చింతల శ్రీనివాస్‌, ఎల్‌వీ సూర్యనారాయణ, ఎన్‌ సుధాకర్‌రావు, కే వెంకటేశ్వర్లు, భూపాలపల్లి జీఎం ఎస్‌డీ హబీబ్‌ హుస్సేన్‌, బెల్లంపల్లి రీజియన్‌ జీఎంలు డీ రవి ప్రసాద్‌, బీ సంజీవరెడ్డి, శ్రీరాంపూర్‌ ఏరియా జీఎం ఏ మ నోహర్‌, రవికుమార్‌, ఎస్‌ఓటూ జీఎం రాంమోహన్‌, కార్పొ రేటర్‌ జీఎంలు, ఏజెంట్లు, ఏరియా ఇంజనీర్లు, నిట్‌ ప్రాజెక్టు మేనేజర్లు, ప్రాజెక్టు ఇంజనీర్లు, గ్రూప్‌ ఇంజనీర్లు, ఫైనాన్స్‌, ఐఈడీ మేనేజర్లు, తదితర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2024 | 12:31 AM