Share News

వచ్చే వారంలోనే ఇంటర్‌ ఫలితాలు!

ABN , Publish Date - Apr 20 , 2024 | 11:02 AM

ఇంటర్మీడియట్‌ ఫలితాలను వెల్లడించడానికి బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చే వారంలో ఫలితాల విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించగానే, సోమ లేదా మంగళవారాల్లో ఫలితాలను ప్రకటించాలని భావిస్తున్నారు.

వచ్చే వారంలోనే ఇంటర్‌ ఫలితాలు!

- సోమ లేదా మంగళవారం ప్రకటించే చాన్స్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ఫలితాలను వెల్లడించడానికి బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వచ్చే వారంలో ఫలితాల విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించగానే, సోమ లేదా మంగళవారాల్లో ఫలితాలను ప్రకటించాలని భావిస్తున్నారు. సాధారణంగా ఇంటర్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి విడుదల చేస్తారు. కానీ, రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులే ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలను ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే.

Updated Date - Apr 20 , 2024 | 11:02 AM