Share News

తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా గంధం కరుణాకర్ నాయుడు ఎన్నిక

ABN , Publish Date - Jul 05 , 2024 | 08:07 PM

తెలంగాణ దేవాదాయ-ధర్మాదాయ శాఖ జేఏసీ రాష్ట్ర సభ్యుల సమావేశం బుధవారం (జులై 3, 2024) జరిగింది. అడిక్‌మెట్ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఏజేసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా గంధం కరుణాకర్ నాయుడుని నియమించారు.

తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా గంధం కరుణాకర్ నాయుడు ఎన్నిక
Gandham Karunakar Naidu

హైదరాబాద్: తెలంగాణ దేవాదాయ-ధర్మాదాయ శాఖ జేఏసీ రాష్ట్ర సభ్యుల సమావేశం బుధవారం (జులై 3, 2024) జరిగింది. అడిక్‌మెట్ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఏజేసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా గంధం కరుణాకర్ నాయుడుని నియమించారు. ఉపాధ్యక్షుడిగా ముడుంబై వరదాచార్యులుని ఎన్నుకున్నారు.


ఇక 2017 కటాఫ్ తేదీని తొలగిస్తూ సెప్టెంబర్ 2017 వరకు ఉన్న ప్రతి ఒక్క అర్చక ఉద్యోగిని గ్రాంట్-ఇన్-ఎయిడ్‌లోకి చేరుస్తూ జీవో నంబర్ 121ను సవరణ చేయాలని తీర్మానించారు. ఏపీ నుంచి తెలంగాణ దేవాదాయ శాఖకు రూ.1000 కోట్లు రావాల్సి ఉందని, సీఎం రేవంత్ రెడ్డి వాటిని రప్పించే ప్రయత్నం చేయాలని తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసింది.

Updated Date - Jul 05 , 2024 | 08:07 PM