Share News

Hyderabad: వామ్మో.. మొన్న ఉల్లి.. నేడు వెల్లుల్లి.. కిలో రూ. 300

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:11 PM

పండగవేళ వెల్లుల్లి ధరలు చుక్కలంటుతున్నాయి. మొన్నటి వరకు కిలో రూ.80 నుంచి రూ. 100 వరకు విక్రయించగా ప్రస్తుతం వాటి ధర రూ. 300 వరకు పెరిగింది.

Hyderabad: వామ్మో.. మొన్న ఉల్లి.. నేడు వెల్లుల్లి.. కిలో రూ. 300

బర్కత్‌పుర(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): పండగవేళ వెల్లుల్లి ధరలు చుక్కలంటుతున్నాయి. మొన్నటి వరకు కిలో రూ.80 నుంచి రూ. 100 వరకు విక్రయించగా ప్రస్తుతం వాటి ధర రూ. 300 వరకు పెరిగింది. హోల్‌సేల్‌గా కిలో వెల్లుల్లి రూ.280 నుంచి రూ.300 వరకు విక్రయిస్తుండగా చిరు వ్యాపారులు రూ. 330 వరకు విక్రయిస్తున్నారు. పండగ వేళ వెల్లుల్లి ధరలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. వాస్తవంగా వెల్లుల్లి పంట ఫిబ్రవరి మొదటి వారంలో వస్తుంది. ఉన్న స్టాక్‌ అయిపోతుండడంతో వ్యాపారులు ధరలు పెంచి విక్రయిస్తున్నారు. మరో 20 రోజుల పాటు వీటి ధర ఇలాగే ఉండే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:11 PM