Hyderabad: ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో.. నేడు ట్రాఫిక్ ఆంక్షలు
ABN , Publish Date - Jan 25 , 2024 | 11:52 AM
నేడు టీపీసీసీ(TPCC) మీటింగ్ ఉన్నందున ఎల్‌బీ స్టేడియం(LB Stadium) పరిసరాల్లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు ఉంటాయని నగర ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్(Additional Commissioner of City Traffic) ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): నేడు టీపీసీసీ(TPCC) మీటింగ్ ఉన్నందున ఎల్‌బీ స్టేడియం(LB Stadium) పరిసరాల్లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు ఉంటాయని నగర ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్(Additional Commissioner of City Traffic) ఓ ప్రకటనలో తెలిపారు. వాహనదారులు పోలీసుల సూచనలు పాటించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలు చేరుకోవాలని సూచించారు.