Share News

Hyderabad: భారత్‌- ఇంగ్లాండ్‌ మ్యాచ్‌కు పటిష్ట భద్రత

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:36 PM

ఈ నెల 25 నుంచి 29 వరకు ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఐదు రోజుల పాటు జరగనున్న భారత్‌ ఇంగ్లాండ్‌ టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudhir Babu) వెల్లడించారు.

Hyderabad: భారత్‌- ఇంగ్లాండ్‌ మ్యాచ్‌కు పటిష్ట భద్రత

- రాచకొండ సీపీ సుధీర్‌బాబు

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): ఈ నెల 25 నుంచి 29 వరకు ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఐదు రోజుల పాటు జరగనున్న భారత్‌ ఇంగ్లాండ్‌ టెస్ట్‌ క్రికెట్‌ మ్యాచ్‌కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudhir Babu) వెల్లడించారు. ఈ మేరకు డీసీపీలు, అడిషనల్‌ డీసీపీలు, ఏసీపీలు, హెచ్‌సీఏ అధికారులతో బుధవారం ఉప్పల్‌ స్టేడియం ప్రాంగణంలో సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. టికెట్ల పంపిణీలో, పార్కింగ్‌కు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా బందోబస్తు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో హెచ్‌సీఏ అధ్యక్షులు జగన్‌మోహన్‌రావు, ఉపాధ్యక్షులు దిల్జిత్‌ సింగ్‌, సెక్రటరీ దేవరాజు, మల్కాజిగిరి డీసీపీ పద్మజ, డీసీపీ (ఎస్‌బీ) కరుణాకర్‌, ట్రాఫిక్‌ డీసీపీ-1 మనోహర్‌, అడ్మిన్‌ డీసీపీ ఇందిర, అదనపు డీసీపీ శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 12:36 PM