Share News

Hyderabad: సమ్మర్ ఎఫెక్ట్.. గ్రేటర్‌లో రికార్డుస్థాయిలో పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌

ABN , Publish Date - Mar 15 , 2024 | 11:23 AM

గ్రేటర్‌లో విద్యుత్‌ వినియోగం రికార్డుస్థాయిలో పెరుగుతోంది. రెండురోజులుగా 74 మిలియన్‌ యూనిట్లు నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు ఇదే తరహాలో ఉంటే నెలాఖరు నాటికి 80 మిలియన్‌ యూనిట్లకు చేరుతుందని విద్యుత్‌శాఖ అంచనా వేస్తోంది.

Hyderabad: సమ్మర్ ఎఫెక్ట్.. గ్రేటర్‌లో రికార్డుస్థాయిలో పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లో విద్యుత్‌ వినియోగం రికార్డుస్థాయిలో పెరుగుతోంది. రెండురోజులుగా 74 మిలియన్‌ యూనిట్లు నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు ఇదే తరహాలో ఉంటే నెలాఖరు నాటికి 80 మిలియన్‌ యూనిట్లకు చేరుతుందని విద్యుత్‌శాఖ అంచనా వేస్తోంది. పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లపై అధికలోడ్‌ పడకుండా చర్యలు మొదలుపెట్టింది. ఈమేరకు ఉన్నతాధికారులతో కలిసి టీఎస్ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ(TSSPDCL CMD Musharraf Farooqui) ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. డిమాండ్‌ ఏస్థాయిలో పెరిగినా విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సీఎండీ ఆదేశించారు. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరడం, ఏసీలు, కూలర్ల వినియోగం పెరగడంతో విద్యుత్‌ వినియోగం అధికమవుతోందని అధికారులు చెబుతున్నారు. గురువారం అత్యధికంగా గోషామహల్‌లో 40.7, బేగంపేటలో 40.2, కార్వాన్‌లో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Mar 15 , 2024 | 11:23 AM