Share News

Hyderabad: అరాచకశక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం..

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:42 AM

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అరాచకశక్తులపై కఠినచర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి(Hyderabad City Police Commissioner Kottakota Srinivas Reddy) హెచ్చరించారు.

Hyderabad: అరాచకశక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం..

- రౌడీషీటర్లకు నగర సీపీ హెచ్చరిక

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అరాచకశక్తులపై కఠినచర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి(Hyderabad City Police Commissioner Kottakota Srinivas Reddy) హెచ్చరించారు. నగరంలో అల్లరిమూకలు, కేడీలు, రౌడీషీటర్లు ఇబ్బందులు సృష్టించినా, గొడవలు, కొట్లాటలకు దిగినా ఉపేక్షించేది లేదన్నారు. ఈ మేరకు ఐదుగురు రౌడీషీటర్లపై నమోదైన కేసుల్లో 107 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చి ముద్దాయిలను జిల్లా అదనపు మేజిస్ట్రేట్‌ హోదాలో సీపీ విచారించారు. బంజారాహిల్స్‌(Banjara Hills)కు చెందిన రౌడీషీటర్లు సయ్యద్‌ మాజీద్‌ అలియాస్‌ డాక్టర్‌ వర్గంతో పాటు, మహ్మద్‌ అలియాస్‌ పీటర్‌ అలియాస్‌ టార్జాన్‌, మీర్జా హరూన్‌ బేగ్‌తో పాటు, ఆసి్‌ఫనగర్‌ రౌడీషీటర్‌ సయ్యద్‌ ఐజాజ్‌ అలియాస్‌ గోలి, మాసబ్‌ట్యాంక్‌ రౌడీషీటర్‌ సయ్యద్‌ సాదిక్‌లను సీపీ మంగళవారం విచారించారు. పద్ధతి మార్చుకోకపోతే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ. 50 వేల పూచీకత్తు బాండ్లతో పాటు ఇద్దరి హామీతో మంచి ప్రవర్తన కోసం ఏడాది పాటు అవకాశం ఇచ్చారు.

Updated Date - Feb 07 , 2024 | 11:43 AM