Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Hyderabad: చిన్నారుల్లో ఆందోళన కలిగిస్తున్న ‘స్కార్టులెట్‌ జ్వరం’

ABN , Publish Date - Mar 03 , 2024 | 12:44 PM

చిన్నారుల్లో స్కార్టులెట్‌ జ్వరం ఆందోళన కలిగిస్తోందని షాపూర్‌నగర్‌(Shahpurnagar) పీహెచ్‌సీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ నవనీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Hyderabad: చిన్నారుల్లో ఆందోళన కలిగిస్తున్న ‘స్కార్టులెట్‌ జ్వరం’

హైదరాబాద్: చిన్నారుల్లో స్కార్టులెట్‌ జ్వరం ఆందోళన కలిగిస్తోందని షాపూర్‌నగర్‌(Shahpurnagar) పీహెచ్‌సీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ నవనీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసుపత్రికి వచ్చే చిన్నారుల్లో ప్రతీ 20 మందిలో 10, 12 మంది స్కార్టులెట్‌ జ్వరంతో బాధపడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా సంవత్సరం నుంచి 15 సంవత్సరాల వయస్సు ఉన్న బాల, బాలికలకు ఈ జ్వరం వ్యాపిస్తోందని తెలిపారు. ఈ జ్వరం ఉన్న వారు పాఠశాలలో తుమ్మినా, దగ్గినా ప్రక్క వారికి వ్యాపిస్తుందని తెలిపారు. 102 డిగ్రీలతో జ్వరం రావడం, అకస్మాత్‌గా గొంతు నొప్పి, తలనొప్పి, వికారం, వాంతులు రావడం జరుగుతుంది. ఇదే కాక కడుపు నొప్పి, శరీరంపై దద్దుర్లు, నాలుక ఎర్రగా మారడం, గొంతు, నాలుకపై తెల్లనిపూత రావడం, ట్రాన్సిల్స్‌ ఎరుపురంగులో పెద్దవిగా కనిపిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.

Updated Date - Mar 03 , 2024 | 12:44 PM