Share News

Hyderabad: న్యూ ఇయర్‌ వేడుకలు.. ఓఆర్‌ఆర్‌పై నో ఎంట్రీ

ABN , Publish Date - Dec 31 , 2024 | 04:22 AM

కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మంగళవారం ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌), పీవీఆర్‌ ఎక్స్‌ప్రె్‌సవేపై వాహనాలను అనుమతించబోమని పోలీసులు వెల్లడించారు.

Hyderabad: న్యూ ఇయర్‌ వేడుకలు.. ఓఆర్‌ఆర్‌పై నో ఎంట్రీ

  • పీవీఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే పైన కూడా..

  • ఎయిర్‌ టికెట్లు ఉన్నవారికే అనుమతి

  • హైదరాబాద్‌లో ఫ్లైఓవర్లు బంద్‌

  • నెక్లెస్‌రోడ్‌, ట్యాంక్‌బండ్‌పైనా నోఎంట్రీ

  • తాగి పట్టుబడితే.. రూ.10 వేల జరిమానా, జైలు శిక్ష

  • రెండోసారి డ్రంకెన్‌డ్రైవ్‌కు రూ.15 వేలు, ఏడాది జైలు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా మంగళవారం ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌), పీవీఆర్‌ ఎక్స్‌ప్రె్‌సవేపై వాహనాలను అనుమతించబోమని పోలీసులు వెల్లడించారు. విమాన ప్రయాణికులు మాత్రం టికెట్‌ను చూపించి, ఔటర్‌పై వెళ్లొచ్చని స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి 10 నుంచి బుధవారం ఉదయం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్‌లోని బేగంపేట, లంగర్‌హౌస్‌ ఫ్లైఓవర్లు మినహా.. మిగతా వాటిని మూసివేస్తామని సిటీ పోలీసులు తెలిపారు. ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్‌, మింట్‌కాంపౌండ్‌ రోడ్డు, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌పైనా రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు వాహనాలకు అనుమతి ఉండదన్నారు.


ట్రాఫిక్‌ రద్దీని బట్టి ఎల్‌బీనగర్‌-మందమల్లమ్మ ఫ్లైఓవర్‌ను తెరుస్తామని రాచకొండ పోలీసులు వివరించారు. ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు కచ్చితంగా యూనిఫారాలను ధరించాలని, లేనిపక్షంలో రూ.500 జరిమానా విధిస్తారని పోలీసులు తెలిపారు. మూడు కమిషనరేటర్ల పరిధుల్లో ఎక్కడికక్కడ డ్రంకెన్‌డ్రైవ్‌లు ఉంటాయని, మద్యం సేవించి పట్టుబడేవారు మొదటిసారి నేరం చేసినట్లయితే.. రూ.10వేల జరిమానా, జైలుశిక్ష ఉంటుందని.. రెండోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానా, ఆర్నెల్ల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. రాంగ్‌రూట్‌, ఓవర్‌స్పీడ్‌, సిగ్నల్‌ జంపింగ్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌, హెల్మెట్‌ నిబంధనలపైనా స్పెషల్‌ డ్రైవ్‌లు ఉంటాయన్నారు. కాగా.. డిసెంబరు 31ని పురస్కరించుకుని హైదరాబాద్‌ మెట్రోరైల్‌ సేవలను అర్ధరాత్రి 1.15 వరకు కొనసాగిస్తామని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్‌వీఎ్‌స రెడ్డి తెలిపారు.

Updated Date - Dec 31 , 2024 | 04:22 AM