Share News

Hyderabad: జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ సమస్యకు త్వరలో చెక్‌..!

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:32 PM

జూబ్లీహిల్స్‌(Jubilee Hills) ట్రాఫిక్‌ సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, రోడ్డు నెంబరు 45లో పరిశీలించారు.

Hyderabad: జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ సమస్యకు త్వరలో చెక్‌..!

- అధ్యయనం చేస్తున్న అధికారులు

హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌(Jubilee Hills) ట్రాఫిక్‌ సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, రోడ్డు నెంబరు 45లో పరిశీలించారు. ట్రాఫిక్‌ సమస్య తీవ్రతను, భవిష్యత్తు సవాళ్లను అధిగమించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. అవసరమైన చోట ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిలు, గ్రేడ్‌ సెపరేటర్‌లు ఏర్పాటు చేసేలా నివేదికను రూపొందించనున్నారు. ఈ మేరకు గురువారం నగర పోలీసు కమిషనర్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రోస్‌, ఇతర విభాగాల అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ట్రాఫిక్‌ సమస్యపై అధ్యయనం చేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ, ఇంజనీరింగ్‌ విభాగం అధికారులతో కలిసి ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గించేందుకు తగిన చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. గ్రేటర్‌ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ మాట్లాడుతూ నగరంలో అత్యంత కీలకమైన జంక్షన్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు అని, దీంతోపాటు కేబీఆర్‌ పార్కు చుట్టూ ఉన్న రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఇంజనీరింగ్‌ విభాగం ఓ ప్రణాళిక సిద్ధం చేస్తోందన్నారు. ట్రాఫిక్‌ సమస్యపై త్వరలోనే సీఎంకు నివేదికను అందజేయనున్నట్టు తెలిపారు.

Updated Date - Feb 02 , 2024 | 12:32 PM