Share News

Hyderabad: నెలదాటితే ‘డ్రగ్స్’ నిర్ధారణ కష్టమే...

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:49 PM

కొకైన్‌ తీసుకున్న వారిని వెంటనే పరీక్షిస్తే నిర్ధారణ అవుతుందని, రోజులు గడిచేకొద్దీ ఆనవాళ్లు మాయం అవుతాయని మెడికవర్‌ ఆస్పత్రి న్యూరో సైక్రియాట్రిస్ట్‌ డాక్టర్‌ శివ అనూప్‌ ఎల్లా(Dr. Shiva Anup Ella) తెలిపారు.

Hyderabad: నెలదాటితే ‘డ్రగ్స్’ నిర్ధారణ కష్టమే...

హైదరాబాద్‌సిటీ: కొకైన్‌ తీసుకున్న వారిని వెంటనే పరీక్షిస్తే నిర్ధారణ అవుతుందని, రోజులు గడిచేకొద్దీ ఆనవాళ్లు మాయం అవుతాయని మెడికవర్‌ ఆస్పత్రి న్యూరో సైక్రియాట్రిస్ట్‌ డాక్టర్‌ శివ అనూప్‌ ఎల్లా(Dr. Shiva Anup Ella) తెలిపారు. నగరంలో డ్రగ్స్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, రాడిసన్‌ కొకైన్‌ పార్టీ విచారణ సాగుతున్న సందర్భంలో ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ఈ విషయం వివరించారు. కొకైన్‌ లాంటి మాదక ద్రవ్యాలు సేవిస్తే దాని ఆనవాళ్లు రక్తం, మూత్రం, గోళ్లు, వెంట్రుక వాటిల్లో ఉంటాయని తెలిపారు. సాధారణంగా నెలరోజులు దాటితే ఆనవాళ్లు దొరికే అవకాశాలు తక్కువగా ఉంటాయని వెల్లడించారు. వెంట్రుకలు, గోళ్లు వంటి పరీక్షలను అధికారుల ఆదేశాలతో ఫోరెన్సిక్‌ వైద్యులు చేస్తారని చెప్పారు. మాదకద్రవ్యాల ఆనవాళ్లు రక్తంలో రెండు రోజులు, మూత్రంలో మూడు, ఉమ్ములో రెండు నుంచి నాలుగు రోజులు, గోళ్లు, వెంట్రుకల్లో మూడు నుంచి నాలుగు వారాల వరకు మాత్రమే ఉంటాయని, ఆ సమయంలో పరీక్షిస్తేనే నిర్ధారణకు అవకాశం ఉంటుందని వివరించారు.

city1.2.jpg

Updated Date - Mar 01 , 2024 | 12:49 PM