Share News

Hyderabad: రోడ్డుపైకి గ్రీన్‌మెట్రో బస్సులు.. నేడు అందుబాటులోకి 22 వాహనాలు

ABN , Publish Date - Mar 12 , 2024 | 09:05 AM

గ్రీన్‌ మెట్రోఎక్స్‌ప్రెస్‌.. నాన్‌ ఏసీ ఎలక్ర్టిక్‌ బస్సులు(Non AC electric buses) మంగళవారం నుంచి రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. 22 బస్సులను ఖైరతాబాద్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మంగళవారం మంత్రులు ప్రారంభించనున్నారు.

Hyderabad: రోడ్డుపైకి గ్రీన్‌మెట్రో బస్సులు.. నేడు అందుబాటులోకి 22 వాహనాలు

- ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 220 కిలోమీటర్లు

- మహిళలకు ఉచిత ప్రయాణం

హైదరాబాద్‌ సిటీ: గ్రీన్‌ మెట్రోఎక్స్‌ప్రెస్‌.. నాన్‌ ఏసీ ఎలక్ర్టిక్‌ బస్సులు(Non AC electric buses) మంగళవారం నుంచి రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. 22 బస్సులను ఖైరతాబాద్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మంగళవారం మంత్రులు ప్రారంభించనున్నారు. గ్రేటర్‌లో మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల స్థానంలో 500 గ్రీన్‌ మెట్రో ఎక్స్‌ప్రె్‌సలను అందుబాటులోకి తేనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. నాన్‌ ఏసీ ఎలక్ర్టిక్‌ బస్సులకు ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 220 కిలోమీటర్లు ప్రయాణించనున్నాయి. డీసీ ఫాస్ట్‌ చార్జింగ్‌ పాయింట్‌తో గంట నుంచి గంటన్నరలో ఎలక్ర్టిక్‌ బస్సులకు పూర్తిస్థాయిలో చార్జింగ్‌ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈబస్సుల ఆపరేషన్స్‌ మియాపూర్‌, కంటోన్మెంట్‌ డిపోల నుంచి నిర్వహించనున్నారు. ఏసీ ఎలక్ర్టిక్‌ బస్సుల తరహాలో నాన్‌ ఏసీ బస్సుల్లో సీటింగ్‌ ఉండనుంది. ఈ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు.

city2.jpg

Updated Date - Mar 12 , 2024 | 09:05 AM