Share News

Hyderabad: ఆసిఫ్‏నగర్‌, గండిపేటలో అగ్నిప్రమాదాలు.. 25 కార్లు.. 50 బైకులు దగ్ధం

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:10 PM

ఆసిఫ్‏నగర్‌ పోలీస్ స్టేషన్‌లోని పార్కింగ్‌ స్థలంలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఈ సంఘటనలో 50 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం..

Hyderabad: ఆసిఫ్‏నగర్‌, గండిపేటలో అగ్నిప్రమాదాలు.. 25 కార్లు.. 50 బైకులు దగ్ధం

- కాటేదాన్‌లో బిస్కట్‌ కంపెనీ బుగ్గి

నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం అగ్నిప్రమాదాలు కలకలం రేపాయి. ఆసిఫ్‏నగర్‌(Asif Nagar) పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ప్రమాదంలో 50 ద్విచక్రవాహనాలు దగ్ధం కాగా.., గండిపేట ఖారాపూర్‌లోని గోదాంలో 25 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. కాటేదాన్‌ పారిశ్రామికవాడ మధుబన్‌కాలనీ రోడ్డులోని ఓ బిస్కట్‌ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

హైదరాబాద్: ఆసిఫ్‏నగర్‌ పోలీస్ స్టేషన్‌లోని పార్కింగ్‌ స్థలంలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఈ సంఘటనలో 50 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఆసిఫ్ నగర్‌ గాంధీ విగ్రహం వద్ద పాత ఆసిఫ్ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన స్థలం ఉంది. అందులో కొన్నిరోజులుగా పోలీసుల తనిఖీల్లో సీజ్‌ చేసిన వాహనాలను ఉంచారు. గురువారం రాత్రి 9.50 గంటల ప్రాంతంలో వాహనాల వద్ద ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒకదానికి వెంట మరొకటి అంటుకుని 50 వాహనాలు దగ్ధమయ్యాయి. పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఘటనాస్థలాన్ని నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్‌ హుస్సేన్‌ సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Mar 29 , 2024 | 12:10 PM