Hyderabad: ఉన్నతాధికారులను తప్పుదోవపట్టించిన సీఐ, ఎస్‌ఐ సస్పెండ్
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:10 PM
లాలాగూడ ఇన్‌స్పెక్టర్ పద్మ, అంబర్‌పేట ఎస్‌ఐ అశోక్‌లను హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(Hyderabad CP Kottakota Srinivas Reddy) సస్పెండ్ చేశారు.

హైదరాబాద్ సిటీ: లాలాగూడ ఇన్‌స్పెక్టర్ పద్మ, అంబర్‌పేట ఎస్‌ఐ అశోక్‌లను హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి(Hyderabad CP Kottakota Srinivas Reddy) సస్పెండ్ చేశారు. రోడ్డు ప్రమాదం కేసులో సరైన విచారణ చేయకుండా నిర్లక్ష్యం వహించి ఉన్నతాధికారులను తప్పుదోవపట్టించినందుకు లాలాగూడ ఇన్‌స్పెక్టర్ పద్మను, చైన్‌స్నాచింగ్ కేసులో బాధితులకు న్యాయం చేయకుండా వేధించినందుకు అంబర్‌పేట ఎస్‌ఐ అశోక్‌ను సీపీ సస్పెండ్ చేసినట్లు తెలిసింది.