Share News

Hyderabad: సింథ‘ట్రిక్స్‌’కు చెక్‌.. ఫస్ట్‌ నుంచి ముఖ ఆధారిత హాజరు

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:27 PM

కార్మికుల హాజరు విషయంలో సింథటిక్‌ వేలిముద్రలను ఉపయోగించి జీహెచ్‌ఎంసీ(GHMC) ఖజానాకు గండికొడుతున్న కేసులు వెలుగుచూడడంతో కొత్త విధానంలో హాజరు తీసుకునేందుకు అధికారులు శ్రీకారం చుడుతున్నారు.

Hyderabad: సింథ‘ట్రిక్స్‌’కు చెక్‌.. ఫస్ట్‌ నుంచి ముఖ ఆధారిత హాజరు

హైదరాబాద్‌ సిటీ: కార్మికుల హాజరు విషయంలో సింథటిక్‌ వేలిముద్రలను ఉపయోగించి జీహెచ్‌ఎంసీ(GHMC) ఖజానాకు గండికొడుతున్న కేసులు వెలుగుచూడడంతో కొత్త విధానంలో హాజరు తీసుకునేందుకు అధికారులు శ్రీకారం చుడుతున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ముఖ ఆధారిత (ఫేస్‌ రికగ్నైజేషన్‌) హాజరును తీసుకోనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ను రూపొందించారు. ఇప్పటికే ఈ విధానంపై అధికారులకు అవగాహన కల్పించారు. మొబైల్‌ యాప్‌(Mobile app)లో సర్కిళ్ల వారీగా కార్మికులు, ఎస్‌ఎఫ్ఏల వివరాలు నమోదు చేస్తున్నారు. రిజిస్ర్టేషన్‌ అనంతరం ఫేస్‌ రికగ్నైజేషన్‌ ద్వారా కార్మికుల హాజరు తీసుకుంటారు. కమిషనర్‌ రోనాల్డ్‌రోస్‌ ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Updated Date - Mar 27 , 2024 | 12:27 PM