Share News

Drugs Case: టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం.. హీరో ప్రియురాలితో పాటు మరో వ్యక్తి అరెస్ట్

ABN , Publish Date - Jan 29 , 2024 | 05:53 PM

టాలీవుడ్‌ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద భూతాల్లో ‘డ్రగ్స్ దందా’ ఒకటి. దీనిని ఇండస్ట్రీ నుంచే కాదు, తెలంగాణ నుంచే పూర్తిగా నిర్మూలించాలని అధికారులు సాయశక్తులా ప్రయత్నిస్తున్నా.. చాపకింద నీరులా ఈ డ్రగ్స్ దందా కొనసాగుతూనే ఉంది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల్లో కొందరు ఈ దందాని అత్యంత రహస్యంగా నడుపుతున్నారని ఇదివరకే కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి.

Drugs Case: టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం.. హీరో ప్రియురాలితో పాటు మరో వ్యక్తి అరెస్ట్

టాలీవుడ్‌ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద భూతాల్లో ‘డ్రగ్స్ దందా’ ఒకటి. దీనిని ఇండస్ట్రీ నుంచే కాదు, తెలంగాణ నుంచే పూర్తిగా నిర్మూలించాలని అధికారులు సాయశక్తులా ప్రయత్నిస్తున్నా.. చాపకింద నీరులా ఈ డ్రగ్స్ దందా కొనసాగుతూనే ఉంది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల్లో కొందరు ఈ దందాని అత్యంత రహస్యంగా నడుపుతున్నారని ఇదివరకే కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి. అందుకే.. అధికారులు ఇండస్ట్రీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే.. నార్సింగిలో ఇద్దరు నిందితులను తాజాగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిలో ఒకరు మహిళ కాగా, మరొకరు పురుషుడు. ట్విస్ట్ ఏమిటంటే.. ఆ మహిళ ఒక హీరో ప్రియురాలిగా అని తేలింది.


పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నార్సింగిలో లావణ్య, ఉనీత్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరి నుంచి 4 గ్రాముల MDMA డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. లావణ్య హ్యాండ్ బ్యాగ్‌లో ఈ డ్రగ్స్ లభ్యమైంది. ఒక హీరో ప్రియురాలైన లావణ్య.. సంగీతం టీచర్‌గా పని చేస్తోంది. పోలీసుల విచారణలో.. ఉనీత్ రెడ్డి తనకు డ్రగ్స్ ప్యాకెట్లు ఇచ్చినట్లు లావణ్య తెలిపింది. అయితే.. ఆ డ్రగ్స్‌ని కొన్ని రోజుల క్రితమే ఉనీత్ నుంచి ఆమె కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఆ సమాచారంతోనే లావణ్యని SOT పోలీసులు తనిఖీ చేయగా.. హ్యాండ్‌బ్యాగ్‌లో ప్యాకెట్లు దొరికాయి. ఈ ఇద్దరిపై NDPS 22బీ, రెడ్ విత్ 8సీ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను రిమాండ్‌కి తరలించారు.

Updated Date - Jan 29 , 2024 | 05:53 PM