Share News

TS News: నేడు బెల్లంపల్లి, నస్పూర్ మున్సిపాలిటీల్లో బల నిరూపణ.. సర్వత్రా ఉత్కంఠ

ABN , Publish Date - Jan 12 , 2024 | 07:57 AM

నేడు బెల్లంపల్లి, నస్పూర్ మున్సిపాలిటీల్లో బల నిరూపణ పరీక్ష జరగనుంది. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో మున్సిపల్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. నస్పూర్‌లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ ఉండటంతో అవిశ్వాస తీర్మానం నెగ్గనుంది.

TS News: నేడు బెల్లంపల్లి, నస్పూర్ మున్సిపాలిటీల్లో బల నిరూపణ.. సర్వత్రా ఉత్కంఠ

మంచిర్యాల : నేడు బెల్లంపల్లి, నస్పూర్ మున్సిపాలిటీల్లో బల నిరూపణ పరీక్ష జరగనుంది. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో మున్సిపల్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. నస్పూర్‌లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ ఉండటంతో అవిశ్వాస తీర్మానం నెగ్గనుంది. బెల్లంపల్లిలో చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్‌కు పూర్తి మెజారిటీ ఉన్నా.. అధిష్టానం పట్టించుకోకపోవడంతో కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 19మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేశారు. బెల్లంపల్లి ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ చోటు చేసుకుంది.

Updated Date - Jan 12 , 2024 | 07:57 AM