Share News

Big Breking: వరంగల్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్

ABN , Publish Date - Apr 01 , 2024 | 09:49 PM

Warangal MP Candidate: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో 12 నుంచి 15 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న కాంగ్రెస్.. తాజాగా మరో అభ్యర్థిని ప్రకటించింది. ఎవరూ ఊహించని రీతిలో ఈ అభ్యర్థి ప్రకటన ఉండటం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది...

Big Breking: వరంగల్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో (TG Lok Sabha Polls) 12 నుంచి 15 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్న కాంగ్రెస్ (Congress) .. తాజాగా మరో అభ్యర్థిని ప్రకటించింది. ఎవరూ ఊహించని రీతిలో ఈ అభ్యర్థి ప్రకటన ఉండటం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్య (Kadiyam Kavya) పేరును ప్రకటిస్తూ అధికార ప్రకటనను కాంగ్రెస్ రిలీజ్ చేసింది. ఈమె.. మాజీ మంత్రి, సీనియర్ నేత కడియం శ్రీహరి కుమార్తె. సోమవారం నాడు సుదీర్ఘ సీఈసీ సమావేశం జరిగింది. ఈ భేటీలో తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను కూడా ఖరారు చేయడం జరిగింది. నాలుగు స్థానాలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఒకే ఒక్క పార్లమెంట్‌కు మాత్రమే అభ్యర్థిని ప్రకటించడం జరిగింది.

ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమైన టీడీపీ మహిళా నేత!

ఇదిగో అఫిషియల్

Kadiyam-Kavya.jpg


ఊహించని రీతిలో..!

బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించగా రాజీనామా చేసి బయటికొచ్చిన సంగతి తెలిసిందే. పార్టీపై ఉన్న వ్యతిరేకత, పార్టీ పరిస్థితి, కవిత అరెస్ట్ ఇవన్నీ మైనస్ కాబోతున్నాయని తాను అభ్యర్థిగా పోటీ చేయట్లేదని చెప్పి కారు పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాసి.. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వాస్తవానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిచయాలున్న కడియం శ్రీహరినే అభ్యర్థిగా ప్రకటిస్తారని పెద్ద ఎత్తునే ప్రచారం జరిగింది. ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలుందన్న రేంజ్‌లో హడావుడి జరిగింది. సీన్ కట్ చేస్తే.. కడియం కావ్యకు టికెట్ దక్కింది. అక్కడ వదిలేసి వచ్చిన సీటును.. ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చేసిందన్న మాట. ఇది నిజంగా ఊహించనిదేనని కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. అయితే కడియం రాకను స్థానికంగా కొందరు వ్యతిరేకించారు కూడా. పరిస్థితి ఎలా ఉంటుందో.. హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి.

Kadiyam-Kavyaa.jpg


ముందే చెప్పిన ఏబీఎన్

కాగా.. కడియం శ్రీహరి, కావ్య గులాబీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్‌లో చేరబోతున్నారని అందరికంటే ముందుగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎక్స్‌క్లూజివ్‌గా చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు.. కడియం కావ్యకే వరంగల్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ అని కూడా దమ్మున్న ఏబీఎన్ ముందే చెప్పింది. ఏబీఎన్‌లో వచ్చిన వార్తలే అక్షర సత్యం అయ్యాయి. అటు చేరిక.. ఇటు టికెట్ వస్తుందన్న రెండు విషయాలు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చెప్పినట్లుగానే నిజమయ్యాయి. పలు మెయిన్ స్ట్రీమ్ మీడియా, దినపత్రికల్లో పెద్ద ఎత్తున కడియం శ్రీహరి పేరే ప్రచారం జరిగింది కానీ.. ఏబీఎన్‌లో మాత్రం మొదట్నుంచీ కావ్య పేరే వచ్చింది.. అదే నిజమైంది కూడా.

ABN-Andhrajyothy.jpg


పెండింగ్‌లో మూడు!

మరోవైపు.. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ మూడు స్థానాలకు ఆశావహులు ఎక్కువగా ఉండటం, మంత్రులే రంగంలోకి దిగి తమ కుటుంబానికి ఇవ్వాల్సిందేనని గట్టిగా పట్టుబడుతుండటంతో పెండింగ్‌లో ఉంచాల్సిన పరిస్థితి వచ్చిందని టాక్. ఒకట్రెండు రోజుల్లో ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా.. ఖమ్మం నియోజకవర్గానికి ఓ వైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడికి కావాలని.. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సతీమణి నందినికి టికెట్ ఇవ్వాలని గట్టిగా అధిష్టానం దగ్గర కూర్చున్నారట. ఈ ఇద్దరికీ తోడు సామాజిక వర్గం పరంగా చూస్తే.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగంధర్‌కు ఇవ్వాలని కోరుతున్నారట. దీనికి తోడు నందమూరి సుహాసిని పేరు కూడా తెరపైకి వచ్చింది. దీంతో ఈ నలుగురిలో ఎవరికి ఇవ్వాలో.. ఎవర్ని పక్కనెట్టాలో తెలియక అధిష్టానం మల్లగుల్లాలు పడుతోందట.

Telangana-Congress.jpg

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 01 , 2024 | 10:23 PM