Share News

CM Revanth Reddy: అభ్యర్థుల్ని నిర్ణయించే అధికారం హైకమాండ్‌దే.. మార్చి 3 వరకు దరఖాస్తులు

ABN , Publish Date - Jan 30 , 2024 | 08:57 PM

లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దరఖాస్తులను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అభ్యర్థులను నిర్ణయించే సర్వ అధికారాలను హై కమాండ్‌కి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రానికి పరిశీలకులను నియమించిందని చెప్పిన ఆయన.. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు.

CM Revanth Reddy: అభ్యర్థుల్ని నిర్ణయించే అధికారం హైకమాండ్‌దే.. మార్చి 3 వరకు దరఖాస్తులు

లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దరఖాస్తులను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అభ్యర్థులను నిర్ణయించే సర్వ అధికారాలను హై కమాండ్‌కి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రానికి పరిశీలకులను నియమించిందని చెప్పిన ఆయన.. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. తన అధ్యక్షతన కాంగ్రెస్ ఎన్నికల కమిటీతో సమావేశమైన అనంతరం.. ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. దరఖాస్తుల స్ర్కూటిని కోసం ప్రత్యేక కమిటీని వేయడం జరిగిందని పేర్కొన్నారు.


ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైందని.. మార్చి 3వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఎమ్మెల్యేలు ఎవరు అడిగినా అపాయింట్‌మెంట్ ఇస్తామన్నారు. జనరల్ స్థానాలకు దరఖాస్తు ఫీజు రూ.50 వేలు.. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు దరఖాస్తు ఫీజు రూ.25 వేలు ఉంటుందని చెప్పారు. 17 పార్లమెంట్ సెగ్మెంట్‌లకు మంత్రులను, ఇంఛార్జీలను నియమించడం జరిగిందన్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు తాము ఫిబ్రవరి 2వ తేదీన ఇంద్రవెల్లి సభ నుంచి లోక్‌సభ శంఖారావం పూరిస్తున్నామని చెప్పుకొచ్చారు.

Updated Date - Jan 30 , 2024 | 09:00 PM