Share News

BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశం.. ఎప్పుడంటే..

ABN , Publish Date - Jan 17 , 2024 | 04:37 PM

బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీరామారావు(KTR) ఆ పార్టీ ఎమ్మెల్సీలతో రేపు(గురువారం) సమావేశం నిర్వహించనున్నారు. లోక్ సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశం.. ఎప్పుడంటే..

హైదరాబాద్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీరామారావు(KTR) ఆ పార్టీ ఎమ్మెల్సీలతో రేపు(గురువారం) సమావేశం నిర్వహించనున్నారు. లోక్ సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరగనుండగా.. ఎమ్మెల్సీలకు లోక్ సభ నియోజకవర్గాల ఇంఛార్జి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరువాత.. ఆ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలని చూస్తోంది.

ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా ప్రతి రోజూ తెలంగాణ భవన్ లో సమావేశాలు జరుగుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో సన్నద్ధతపై కేటీఆర్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Updated Date - Jan 17 , 2024 | 05:35 PM