Share News

Hanuman Jayanthi: రేపు హనుమాన్ శోభాయాత్రకు పూర్తైన ఏర్పాట్లు.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

ABN , Publish Date - Apr 22 , 2024 | 01:55 PM

రేపు (మంగళవారం) హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో హనుమాన్ జయంతి శోభా యాత్ర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. రేపు ఉదయం 11:20 గంటలకు ఆంజనేయుని శోభా యాత్ర ప్రారంభం కానుంది.

Hanuman Jayanthi: రేపు హనుమాన్ శోభాయాత్రకు పూర్తైన ఏర్పాట్లు.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్: రేపు (మంగళవారం) హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో హనుమాన్ జయంతి శోభా యాత్ర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. రేపు ఉదయం 11:20 గంటలకు ఆంజనేయుని శోభా యాత్ర ప్రారంభం కానుంది. ఈ ఊరేగింపు గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమై.. తాడ్‌బండ్ సికింద్రాబాద్ మీదుగా గౌలిగూడ రామమందిరం, పుత్లిబౌలి క్రాస్ రోడ్, ఆంధ్రాబ్యాంక్ క్రాస్ రోడ్, కోటి, సుల్తాన్ బజార్, రాంకోటి, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడపల్లి మీదుగా కొనసాగనుంది.

AP SSC Results: షాకింగ్.. ఏపీలో ఒక్కరూ పాస్‌ కాని స్కూళ్లు ఎన్నంటే..!?


నగరంలో దాదాపు 12 కిలో మీటర్ల దూరం శోభ యాత్ర నిర్వహించనున్నారు. రాత్రి 8 గంటలకు తాడ్‌బండ్‌లోని హనుమాన్ మందిరం వద్ద యాత్ర ముగియనుంది. మరో ఊరేగింపు కర్మన్‌ఘాల్‌లోని ఆంజనేయస్వామి దేవాలయం నుంచి ప్రారంభమై చంపాపేట్ వద్ద హైదరాబాద్ నగర పరిధిలోకి ప్రవేశించనుంది. మూసారం బాగ్ జంక్షన్ - మలక్ పేట - నల్గొండ ఎక్స్ రోడ్ - అజంపురా రోటరీ - చాదర్ ఘాట్ ఎక్స్ రోడ్ మీదుగా డీఎంఅండ్‌హెచ్ఎస్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలవనుంది. ఇక ఈ యాత్ర జరగనున్న ప్రదేశాలన్నింటిలోనూ ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.

ఇవి కూడా చదవండి..

AP SSC Results: పది ఫలితాల్లో ఎవరిది పైచేయి.. ఫస్ట్.. లాస్ట్ ఏ జిల్లా..?

Viral: వేసవికి తెలివితో చెక్.. వేడి నుంచి ఉపశమనం కోసం ప్రజలు ఎలాంటి ట్రిక్కులను ఉపయోగిస్తున్నారో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 22 , 2024 | 01:55 PM