Share News

TS News: బీజేపీకి ఆరేపల్లి మోహన్ రాజీనామా

ABN , Publish Date - Mar 29 , 2024 | 06:25 PM

బీజేపీకి ఆరేపల్లి మోహన్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పెద్దపల్లి టికెట్ ఆశించారు.

TS News: బీజేపీకి ఆరేపల్లి మోహన్ రాజీనామా

కరీంనగర్,మర్చి29: బీజేపీకి ఆరేపల్లి మోహన్రా (arepally mohan) జీనామా చేశారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పెద్దపల్లి టికెట్ ఆశించారు. కానీ ఈ టికెట్ గోమాసె శ్రీనివాస్‌కు ఆ పార్టీ అధిష్టానం కేటాయించింది. దీంతో ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. అయితే తనకు పెద్దపల్లి ఎంపీ టికెట్ కేటాయించాలంటూ.. ఆరేపల్లి మోహన్.. పలుమార్లు పార్టీ అగ్రనాయకత్వాన్ని కలిసి విజ్జప్తి చేశారు.

కానీ అతని అభ్యర్థనను పరిగణలోకి తీసుకోకుండా.. మరోకరికి ఈ టికెట్ కేటాయించడంతో.. ఆయన రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో అంటే 2009లో మానకొండూరు నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరేపల్లి మోహన్ బరిలో దిగి విజయం సాధించారు. అయితే 2014, 2019 ఎన్నికల్లో అదే పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ఇక 2019లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో తనకు మానకొండూరు ఎమ్మెల్యే సీటు, లేకుంటే ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కతోందని ఆశించారు. కానీ ఆయనకు అవేమీ దక్కలేదు.

దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన కారు పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. అనంతరం 2023 అక్టోబర్‌లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ఆ పార్టీ కుండువా కప్పుకున్నారు. దీంతో పెద్దపల్లి ఎంపీ టికెట్‌పై ఆయన ఆశలు పెట్టుకున్నారు. అందుకోసం ఆ పార్టీ అగ్రనాయకత్వంతో తన మనస్సులోని మాటను చెప్పారు. కానీ మోహన్ మాటలు పక్కన పెట్టి.. శ్రీనివాస్‌కు టికెట్ కేటాయించడంతో.. బీజేపీకి రాజీనామా చేశారు.

Updated Date - Mar 29 , 2024 | 06:25 PM