Share News

పంట నష్టపరిహారం పంపిణీ నేటి నుంచే

ABN , Publish Date - May 06 , 2024 | 05:42 AM

వడగండ్ల వానల కారణంగా యాసంగి సీజన్‌లో పంటలు నష్టపోయిన రైతులకు సోమవారం నుంచి నష్టపరిహార ం పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ

పంట నష్టపరిహారం పంపిణీ నేటి నుంచే

ఇటీవలి వడగండ్ల వానకు 15,814 ఎకరాల్లో నష్టం

ఎకరాకు 10వేల చొప్పున 15.81కోట్ల పరిహారం

రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం: తుమ్మల

హైదరాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): వడగండ్ల వానల కారణంగా యాసంగి సీజన్‌లో పంటలు నష్టపోయిన రైతులకు సోమవారం నుంచి నష్టపరిహారం పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని, సోమ- మంగళవారాల్లో నగదు బదిలీ చేపడతామని వెల్లడించారు. గత మార్చి 16వ తేదీ నుంచి 24 వ తేదీ వరకు కురిసిన వడగండ్ల వానతో పది జిల్లాల్లో 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు నివేదిక ఇచ్చారని పేరొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 15,81,40,000ను నష్ట పరిహారం కింద ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండటంతో నష్ట పరిహారం పంపిణీ విషయమై ఈసీ అనుమతి కోరుతూ లేఖ రాయగా.. ఆమోదం లభించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నదని, గతంలో ఎప్పుడూ లేని విధంగా పంట నష్టం సంభవించిన 45రోజుల్లోనే నష్టపరిహారం చెల్లించి, రైతులకు ఉపమనం కలిగించనున్నట్లు వెల్లడించారు.

Updated Date - May 06 , 2024 | 05:42 AM