Share News

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Apr 12 , 2024 | 10:33 PM

యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం కమిషన రేట్‌ హెడ్‌క్వార్టర్‌లో రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో ఆధ్వర్యంలో గంజాయి, కల్తీ కల్లు సేవిం చడం వల్ల జరిగే అనర్ధాలపై ప్రజలను చైతన్య పరుస్తూ రూపొందించిన వాల్‌ పోస్టర్లను ఆవిష్క రించారు.

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

ఏసీసీ, ఏప్రిల్‌ 12: యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం కమిషన రేట్‌ హెడ్‌క్వార్టర్‌లో రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో ఆధ్వర్యంలో గంజాయి, కల్తీ కల్లు సేవిం చడం వల్ల జరిగే అనర్ధాలపై ప్రజలను చైతన్య పరుస్తూ రూపొందించిన వాల్‌ పోస్టర్లను ఆవిష్క రించారు. సీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి, కల్తీ కల్లు వినియోగం ద్వారా వ్యక్తులకు, సమాజా నికి జరిగే నష్టాన్ని తెలిపే విధంగా వాల్‌ పోస్టర్‌ లను రూపొందించామన్నారు. గంజాయికి బానిస లుగా మారిన యువత భవిష్యత్‌ను నాశనం చేసు కుంటుందని, యువకుల జీవితాలు విచ్ఛిన్నం కావ డంతో పాటు తల్లిదండ్రులు మానసిక క్షోభకు గుర వుతున్నారన్నారు. గం జాయి, మత్తు పదార్ధాలు ఎవరైనా విక్రయిస్తే వారి సమాచారాన్ని తెలియ జేసే వారి వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపారు. గంజాయి రహిత కమిషనరేట్‌ కోసం అధి కారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ రాజు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ రాఘవేందర్‌రావు, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ బుద్దె స్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 10:33 PM