Share News

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

ABN , Publish Date - Jan 12 , 2024 | 10:05 PM

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో నిర్వహించారు. సైన్స్‌ సెంటర్‌లో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, డీవైఎస్‌వో శ్రీకాం త్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దుర్గా ప్రసాద్‌లు పాల్గొని వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

మందమర్రి టౌన్‌, జనవరి 12: స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి అన్నా రు. శుక్రవారం సింగరేణి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించిన వివేకానంద జయంతికి ఆమె హాజరై చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆయన జీవితం అందరికి స్ఫూర్తి అని, ఆయన ఆశ య సాధన లక్ష్యంగా విద్యార్థులు పని చేయాలన్నారు. కరస్పాండెంట్‌ హీరాలాల్‌ ఉపాధ్యాయ, ప్రిన్సిపాల్‌ సుష్మ, లెక్చరర్లు పాల్గొన్నారు.

ఏసీసీ: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో నిర్వహించారు. సైన్స్‌ సెంటర్‌లో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, డీవైఎస్‌వో శ్రీకాం త్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దుర్గా ప్రసాద్‌లు పాల్గొని వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ వివేకానందుడు చూపిన దారిలో యువత నడవాలని సూచించారు. 20 మంది యువకులను సన్మానించి మెమోంటోలు అంద జేశారు. వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్‌ పాల్గొన్నారు.

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌) ఆధ్వర్యంలో ఓవర్‌ బ్రిడ్జి వద్ద ఉన్న వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేష్‌, శ్రీనివాస్‌,రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

మంచిర్యాల కలెక్టరేట్‌: సైన్స్‌ సెంటర్‌లో స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో రహీం బ్లడ్‌ ఆర్గనైజర్‌ అబ్దుల్‌ రహీంను అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌ సన్మానించారు. రహీం 8 సంవత్సరాలుగా ఆపదలో ఉన్న వారికి రక్తం అందిస్తున్నారన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 10:05 PM