Share News

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Aug 24 , 2024 | 10:01 PM

విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో చదువుకోవాలని ఏసీపీ రవికుమార్‌ పేర్కొన్నారు. శని వారం సెయింట్‌మేరీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కు గంజాయి, మత్తు పదార్ధాలు, నూతన చట్టాలు, సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు.

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

బెల్లంపల్లి, ఆగస్టు 24 : విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో చదువుకోవాలని ఏసీపీ రవికుమార్‌ పేర్కొన్నారు. శని వారం సెయింట్‌మేరీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కు గంజాయి, మత్తు పదార్ధాలు, నూతన చట్టాలు, సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. ఏసీపీ మాట్లాడుతూ గంజాయి, తదితర మత్తు పదార్ధాల నివారణపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాల న్నారు. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అనంతరం ఇటీవల యాంటీ డ్రగ్స్‌ అం శంపై నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్‌ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందిం చారు. రూరల్‌ సీఐ అప్జలొద్దీన్‌, ప్రిన్సిపాల్‌, ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రజల రక్షణ కోసమే తనిఖీలు

భీమారం: ప్రజల రక్షణ కోసమే కమ్యూనిటీ కాంటా క్టు ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని సీఐ మోహన్‌ పేర్కొ న్నారు. శనివారం బూరుగుపల్లి గ్రామంలో ఇండ్లలో సోదాలు చేయగా నగవత్‌ కమల, భుక్య మారుతి, ధరవత్‌ రాజ్యనాయక్‌, పాల్తె బుజ్జి ఇండ్లలో గుడుంబా తయారీకి ఉపయోగించే 200 లీటర్ల బెల్లం పానకం, 10 కేజీల బెల్లం, 16 లీటర్ల గుడుంబా పట్టుకోవడంతో పాటు సరైన పత్రాలు లేని 34 బైక్‌లు, 2 ఆటోలను సీజ్‌ చేశారు.

సీఐ మాట్లాడుతూ గుడుంబా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకొంటా మన్నారు. యువకులు, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. వాహనదారులు అన్ని ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండాలన్నారు. ఏదైనా ఆపద వస్తే డయల్‌ 100కు సమాచారం అందించా లన్నారు. ఎస్‌ఐ రాములు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 10:01 PM