Share News

కలెక్టరేట్‌ ఎదుట యాదవ కులస్తుల నిరసన

ABN , Publish Date - May 21 , 2024 | 10:25 PM

ప్రభుత్వం సబ్సిడీపై అందజేసే గొర్రెల యూనిట్ల కోసం డీడీలు చెల్లించినా గొర్రెలు పంపిణీ చేయలేదని యాదవ కులస్తులు మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 83 మంది ఒకొక్కరం రూ. 43,750 చొప్పున డీడీలు చెల్లించినా నేటికీ గొర్రెలు రాలేదని భీమిని మండలం చిన్న గుడిపేట గ్రామానికి చెందిన పలువురు యాదవులు పేర్కొన్నారు.

కలెక్టరేట్‌ ఎదుట యాదవ కులస్తుల నిరసన

నస్పూర్‌, మే 21 : ప్రభుత్వం సబ్సిడీపై అందజేసే గొర్రెల యూనిట్ల కోసం డీడీలు చెల్లించినా గొర్రెలు పంపిణీ చేయలేదని యాదవ కులస్తులు మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 83 మంది ఒకొక్కరం రూ. 43,750 చొప్పున డీడీలు చెల్లించినా నేటికీ గొర్రెలు రాలేదని భీమిని మండలం చిన్న గుడిపేట గ్రామానికి చెందిన పలువురు యాదవులు పేర్కొన్నారు. డీడీలు చెల్లించి గొర్రెలు వస్తాయని ఎదురు చూస్తున్నామని వారు తెలిపారు. ఆయా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నామన్నారు. డీడీలు కట్టిన లబ్ధిదారులకు గొర్రెలు లేదా డీడీలు వాపస్‌ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు తులా మధుసూదన్‌రావు మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద రూ. 43,750 రూపాయల డీడీలను కట్టించిందన్నారు. 2022లో డీడీలు చెల్లించగా 18 నెలల నుంచి ఆయా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా నేటికి గొర్రెలు అందలేదన్నారు. జిల్లా అధికారులు స్పందించి యాదవులకు న్యాయం చేయాలని కోరారు. లబ్ధిదారులు బీరయ్య, రాజ్‌ కుమార్‌, రాచ బీరయ్య, మల్లయ్య, ఐలయ్య, దాస్య, బోసు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2024 | 10:25 PM