Share News

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Jan 18 , 2024 | 10:13 PM

నస్పూర్‌ మున్సిపాలిటీలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని గురువారం కాం ట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో నస్పూర్‌ గేట్‌ వద్ద రిలే నిరహార దీక్షను చేపట్టారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

నస్పూర్‌, జనవరి 18: నస్పూర్‌ మున్సిపాలిటీలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని గురువారం కాం ట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో నస్పూర్‌ గేట్‌ వద్ద రిలే నిరహార దీక్షను చేపట్టారు. దీక్షలను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ ప్రారం భించారు. ఆయన మాట్లాడుతూ మూడు సంవత్సరాల ఈపీఎఫ్‌ డబ్బులను కార్మికుల ఖాతాల్లో జమ చేయయాలని డిమాండ్‌ చేశారు. కొత్తగా నియా మకమైన కార్మికుల పేర్లను ఆన్‌లైన్‌లో చేర్చాలని, కార్మికుల పెండింగ్‌ వేతనాలను వెంటనే చెల్లించాలన్నారు. కార్మికులకు ప్రతీ నెల 1వ తేదీన వేతనం అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని, హక్కుల సాధనకు ఆందోళన చేపట్టా మన్నారు. దీక్షలో కొయ్యల వెంకటి, దాసరి రాజేశ్వర్‌, మద్దెర్ల సతీష్‌, రాజం, అడ్లకొండ ప్రబాకర్‌, గారె లింగయ్య, గారె కిష్టయ్య, దాసరి రమా, కాంపెల్లి రాజం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 10:13 PM