Share News

పదోన్నతితో బాధ్యత పెరుగుతుంది

ABN , Publish Date - Jan 12 , 2024 | 10:03 PM

పోలీసు అధికారులకు పదో న్నతి ద్వారా బాధ్యత పెరుగుతుందని రామగుండం సీపీ రెమా రాజేశ్వరి అన్నారు. కమిషనరేట్‌ పరి ధిలో ఎస్‌ఐగా పదోన్నతులు పొందిన 8 మంది, హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తూ ఏఎస్‌ఐగా పదో న్నతి పొందిన 10 మంది, కానిస్టేబుల్‌గా పనిచేస్తూ హెడ్‌ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన 19 మం దిని శుక్రవారం హెడ్‌ క్వార్టర్‌లో అభినందించారు.

పదోన్నతితో బాధ్యత పెరుగుతుంది

ఏసీసీ, జనవరి 12: పోలీసు అధికారులకు పదో న్నతి ద్వారా బాధ్యత పెరుగుతుందని రామగుండం సీపీ రెమా రాజేశ్వరి అన్నారు. కమిషనరేట్‌ పరి ధిలో ఎస్‌ఐగా పదోన్నతులు పొందిన 8 మంది, హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తూ ఏఎస్‌ఐగా పదో న్నతి పొందిన 10 మంది, కానిస్టేబుల్‌గా పనిచేస్తూ హెడ్‌ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన 19 మం దిని శుక్రవారం హెడ్‌ క్వార్టర్‌లో అభినందించారు. సీపీ మాట్లాడుతూ విధులను క్రమశిక్షణతో నిర్వ హిస్తూ ప్రజల్లో పోలీసు శాఖపై నమ్మకం పెంచేలా కృషి చేయాలన్నారు. పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు బోర్లకుంట పోచలింగం, అధికారులు పాల్గొన్నారు.

శ్రీరాంపూర్‌: శ్రీరాంపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కాని స్టేబుల్‌గా పనిచేస్తున్న వేల్పుల రవి హెడ్‌ కానిస్టే బుల్‌గా పదోన్నతి పొందారు సీఐ రమేష్‌బాబు, ఎస్‌ఐ రాజేశ్‌ రవిని సన్మానించారు.

Updated Date - Jan 12 , 2024 | 10:03 PM